రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు.పాలిటిక్స్ లో ఉంటే వివాదాలు వస్తున్నాయని, ఇప్పుడున్న పరిస్థితిలో పూర్తి స్థాయి రాజకీయనాయకుడిగా ఉండలేను. వ్యాపారం చూసుకుందాం అనుకుంటున్నా... గెలుపు , ఓటముల గురించి ఆలోచనలేదు... ఈ ఎన్నికలలో పోటీ చెయ్యట్లేదు. మరల అవకాశం వస్తే చేస్తాను.
గుంటూరులోనిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. " కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేను. నా పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన ఉంది. మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను.. కానీ, రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నా. రెండేళ్ల క్రితం మా నాన్న వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతోంది. అందుకే రాజకీయాలను వదిలేస్తున్నా” అని గల్లా జయదేవ్ అన్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్లు చెప్పిన ఆయన..స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకొని ముందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలు, ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్లో పోరాడా. రాజధానిగా అమరావతికే మద్దతిస్తా. ప్రభుత్వం నుంచి బయటకి వచ్చినప్పుడు అవిశ్వాసం పెట్టారు. ఆ సమయంలో పార్టీ గొంతు నేనే వినిపించా. దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ కేసులో ఈడీ నన్ను రెండు సార్లు పిలిచి విచారించింది. వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయి. సీబీఐ, ఈడీ నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయి” అని గల్లా జయదేవ్ అన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి