PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Amaravati Works: దేశంలోనే అతిపెద్ద డయాగ్రిడ్ స్ట్రక్చర్‌గా రికార్డు... 49 అంతస్తులతో ఆకాశాన్నంటే టవర్లు! Amaravati Development: ఢిల్లీ, వాషింగ్టన్‌లను మించిపోనున్న నవ్యాంధ్ర రాజధాని! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ భూములు దర్జాగా అమ్ముకోవచ్చు... కీలక ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (29/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Future City: ఫ్యూచర్‌సిటీలో మరికొన్ని గ్రామాలు విలీనం.. అక్కడ అతిపెద్ద బస్ టెర్మినల్, సీఎం కీలక ప్రకటన! PM Modi: నీచ రాజకీయాలకు మహిళా బిల్లు బలి.. 40 ఏళ్ల నాన్చుడు ధోరణిపై ప్రధాని ఘాటు విమర్శలు.. PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Amaravati Works: దేశంలోనే అతిపెద్ద డయాగ్రిడ్ స్ట్రక్చర్‌గా రికార్డు... 49 అంతస్తులతో ఆకాశాన్నంటే టవర్లు! Amaravati Development: ఢిల్లీ, వాషింగ్టన్‌లను మించిపోనున్న నవ్యాంధ్ర రాజధాని! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ భూములు దర్జాగా అమ్ముకోవచ్చు... కీలక ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (29/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Future City: ఫ్యూచర్‌సిటీలో మరికొన్ని గ్రామాలు విలీనం.. అక్కడ అతిపెద్ద బస్ టెర్మినల్, సీఎం కీలక ప్రకటన! PM Modi: నీచ రాజకీయాలకు మహిళా బిల్లు బలి.. 40 ఏళ్ల నాన్చుడు ధోరణిపై ప్రధాని ఘాటు విమర్శలు..

Prajavedhika: ప్రజా వేదిక లో బాధితుల ఆక్రందన! కన్సల్టెన్సీల కక్కుర్తి.. భూ బకాసురుల అరాచకాలు!

Prajavedhika: ప్రజా వేదిక లో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన దేవినేని ఉమా మరియు రఘురామరాజు.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Published : 2026-03-13 07:30:00

మంగళగిరి, మార్చి 12, 2026 న టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా విన్నపాల కార్యక్రమం నేడు ఫిర్యాదుదారుల కన్నీళ్లతో, బాధితుల ఆక్రందనలతో అట్టుడికిపోయింది. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఏపీ స్టేట్ బిల్డింగ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు* ప్రజా సమస్యలను స్వీకరించారు. అక్కడ బయటపడిన కొన్ని సంఘటనలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.

1. అబ్రాడ్ సొల్యూషన్స్ అరాచకం: రూ. 13.70 లక్షల మాయాజాలం!

విదేశాల్లో చదువుకోవాలన్న విద్యార్థి కలను 'అబ్రాడ్ సొల్యూషన్స్' యజమాని ఆలపర్తి చంద్రశేఖర్ అడ్డం పెట్టుకున్నాడు. కంచికచర్లకు చెందిన శ్రీనివాసరావు కోసం నరేంద్ర కుమార్ అనే వ్యక్తి తన ఖాతా నుండి ఏకంగా రూ. 13.70 లక్షలు కన్సల్టెన్సీకి బదిలీ చేశాడు. యూకేలోని డీ మోంట్‌ఫోర్ట్ యూనివర్సిటీకి ఫీజు చెల్లించామని దొంగ రశీదులు చూపించి, తీరా విచారించగా డబ్బు వెనక్కి మళ్లించినట్లు ఆధారాలు దొరికాయి. ఇప్పుడు డబ్బు అడిగితే దుబాయ్ ఏజెంట్ల సాకులు చెబుతూ, బాధితుడిపైనే దాడులకు తెగబడుతున్నారు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా న్యాయం జరగకపోవడంతో బాధితులు నేతలను ఆశ్రయించారు.

2. స్కూల్‌లో స్టూడెంట్ మృతి: ప్రమాదమా? గొంతు నులిమి హత్య చేశారా?

సింగరాయకొండలోని ఒక ప్రముఖ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల సయ్యద్ తౌషిక్ మరణం వెనుక పెను మిస్టరీ దాగి ఉంది. ఫిబ్రవరి 14న తల్లిదండ్రులతో క్షేమంగా మాట్లాడిన గంటకే ఆ బాలుడు విగతజీవిగా మారాడు. పాఠశాల యాజమాన్యానికి సంబంధించిన రహస్యాలను చూశాడన్న నెపంతో ప్రిన్సిపాల్ రమణారెడ్డి, అతని కుమారులు కలిసి బాలుడి గొంతు నులిమి చంపేశారని తండ్రి సయ్యద్ అలీ ఆరోపిస్తున్నారు.

 "సీసీటీవీ ఫుటేజీని మాయం చేశారు.. బాబు మెడపై రంధ్రాలు ఉన్నాయి.." అంటూ ఆ తండ్రి చేసిన ఫిర్యాదు అక్కడ ఉన్నవారందరినీ కలిచివేసింది.

3. ప్రభుత్వ కాలేజీలో 'ప్రిన్సిపల్' అరాచక సామ్రాజ్యం!

వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరపై వెల్లువెత్తిన ఫిర్యాదులు షాక్‌కు గురిచేస్తున్నాయి. తోటి అధ్యాపకులపై భౌతిక దాడులు, కుల వివక్ష, ఏకంగా *రూ. 90 లక్షల వసూళ్లు!* ఏసీబీ నోటీసులు ఇచ్చినా రాజకీయ బలంతో ఆమె ఆగడాలు కొనసాగుతున్నాయని, బాధితుడు జయవర్ధన్ సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశాడు.

4. భూ ఆక్రమణలు - నిరుపేదల హాహాకారాలు

  •  పిడుగురాళ్ళ: 266 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను 'భూ బకాసురులు' ఆక్రమించుకున్నారు. 299 కుటుంబాలు నేడు రోడ్లపై, షెడ్లలో తలదాచుకుంటున్న దయనీయ స్థితి.
  • అనంతపురం: 60 ఏళ్లుగా ఉన్న పొలం దారిని అక్రమంగా మూసివేసి, తహశీల్దార్‌ను సైతం ప్రభావితం చేస్తున్న వైనంపై రైతు ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.
  • పోరుమామిళ్ల: దేవుడి గుడి కట్టిస్తానని నమ్మించి, నిరక్షరాస్యురాలైన లక్షమ్మ భూమిని దొంగ పత్రాలతో కాజేసి అమ్మకానికి పెట్టిన కర్నాటి బలరామిరెడ్డి మోసం వెలుగులోకి వచ్చింది.

Spotlight

Read More →