అర్బన్ అథారిటీల పరిధిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన భూమిని గుర్తించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. కర్నూలు, కడప, అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల అధికారులు, ఛైర్మన్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్బన్ అథారిటీల ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణం, లేఅవుట్లను అభివృద్ధి చేసి అమ్మకాలు చేయడం ద్వారా ఆర్థికంగా పురోగతి సాధించాలన్నారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో మిడిల్ ఇన్కం గ్రూప్, హై ఇన్కం గ్రూప్ ఇళ్లను నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఇళ్ల నిర్మాణాల కోసం అవసరమైన భూమిని ఎంపిక చేయాలని ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా స్థలం ఎంపిక పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!
చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!
టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: