కేంద్ర సహాయమంత్రి, మలయాళ సూపర్ స్టార్ సురేశ్ గోపీపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ తో పాటు, త్రిస్సూర్ పురం సంబరాలకు హాజరయ్యేందుకు వెళుతూ అంబులెన్స్ ను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న త్రిస్సూర్ పురంలోని స్వరాజ్ మైదానానికి ఆయన అంబులెన్స్ లో వచ్చారు. ఈ క్రమంలో ఆయన వన్ వే రోడ్డులో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. అది కూడా రోగులను తరలించే అంబులెన్స్ లో రావడం వివాదాస్పదమైంది. అయితే, తాను అనారోగ్య కారణాల వల్లే ఇలా అంబులెన్స్ లో రావాల్సి వచ్చిందని సురేశ్ గోపీ అప్పట్లో వివరణ ఇచ్చారు. కాలు నొప్పితో జనాల్లో నడవలేనని, ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేని కొందరు యువజనులు తనకు అంబులెన్స్ ను సమకూర్చారని ఆయన వివరణ ఇచ్చారు. కాగా, ఓ కమ్యూనిస్ట్ నేత ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 279, 34 సెక్షన్లు, మోటారు వాహనాల చట్టం కింద 179, 184, 188, 192 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ప్రఖ్యాతిపొందిన సురేశ్ గోపీ రాజకీయాల్లోకి ప్రవేశించడమే కాదు, ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు సంపాదించారు. కేరళలో బీజేపీ తరఫున లోక్ సభకు ఎన్నికైన తొలి ఎంపీగా సురేశ్ గోపీ చరిత్ర సృష్టించారు. ఆయనను కేంద్ర మంత్రివర్గంలో పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయంత్రిగా నియమించారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!
రాష్ట్రంలో బెల్ట్ షాపులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం? వారిలో ఇద్దరు, ముగ్గురిని నడి రోడ్డుపై ఉరి!
ఈ కారణంతో ఉచిత గ్యాస్ సిలిండర్ కోల్పోకండి.. కావాల్సినవి ఇవే! ఈ పథకం కింద మొదటసారి!
వైసిపికి షాక్! మాజీ ఎంపీ పై కేసు నమోదు! రాజకీయాలను వీడనున్న వాసిరెడ్డి పద్మ? కారణమిదే!
వాలంటీర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఇకపై ఆ బాధ్యతలు వారివే! రాజీనామా చేసిన వారి సంగతేంటి?
ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది! ఉదయమా? సాయంత్రమా?
పెన్షన్ డబ్బులతో ఉద్యోగి పరార్! సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: