GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే!

చంద్రబాబు క్వాష్ పిటిషన్ సీజే బెంచ్ కు బదిలీ...

స్కిల్ కేసులో తన అరెస్టు అక్రమమంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసింది. ఈ పి

Published : 2024-01-16 14:54:00

స్కిల్ కేసులో తన అరెస్టు అక్రమమంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసింది.

ఈ పిటిషన్ పై వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది భిన్నాభిప్రాయాలు వెల్లడించారు.

న్యాయమూర్తులు ఇద్దరూ వేర్వేరుగా తీర్పు వెలువరించారు. ముందుగా తీర్పు వెల్లడించిన జస్టిస్ బోస్.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 17 ఏ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

అయితే, జస్టిస్ బేలా ఎం. త్రివేది మాత్రం ఈ కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తించదని పేర్కొన్నారు.

భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు ద్విసభ్య ధర్మాసనం విజ్ఞప్తి చేసింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రారంభించిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది.

ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సెప్టెంబర్ 9న అధికారులు అరెస్టు చేశారు. మెడికల్ గ్రౌండ్స్ పై మధ్యంతర బెయిల్ తో బయటకు వచ్చిన చంద్రబాబు...

తర్వాత రెగ్యులర్ బెయిల్ పొందారు. అయితే, తన అరెస్టు సందర్భంగా సీఐడీ అధికారులు నిబంధనలు పాటించలేదని, గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు ఆరోపించారు.

విపక్ష నేతగా తనకు ఐపీసీ సెక్షన్ 17 ఏ కింద ప్రొటెక్షన్ ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా... చంద్రబాబు వాదనలను హైకోర్టు తిరస్కరించింది.

దీంతో చంద్రబాబు తరఫున ఆయన లాయర్లు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బాలా ఎం త్రివేది వాదనలు విన్నారు.

చంద్రబాబుకు సెక్షన్ 17 ఏ వర్తించదంటూ ఏపీ సీఐడీ వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం గతేడాది అక్టోబరు 20న తీర్పు రిజర్వ్ చేసింది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →