ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించాలని రాష్ట్రప్రభుత్వం ఎంత చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటున్నాయి. కొందరు గుత్తేదారులు సిండికేట్గా ఏర్పడి రీచ్లు నడిపిస్తున్న తీరు.. నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పేదలకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం సీనరేజి తొలగించినా.. వినియోగదారుల నుంచి లోడుకు రూ.5,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి-1 ర్యాంపు బుర్రిలంకలో ఆదివారం రాత్రి భారీ యంత్రాలతో నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా ఇసుక తవ్వి, తరలించారు. స్టాక్యార్డ్తో పాటు నదిలోనూ తవ్వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభించిన ఈ దందా రాత్రి వరకూ కొనసాగింది. పదుల సంఖ్యలో భారీ లారీల్లో ఇసుక బయటకు తరలించారు. స్థానికులు కొందరు అడ్డుకోగా రాత్రి 9 గంటలకు కాసేపు ఆపారు. ఆ సమయంలో ట్యాంకర్లతో బాటలు తడుపుతూ, ఆటోల్లో డీజిల్ను రీచ్ల వద్దకు తరలించే పనులు చేపట్టారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో మూడు లారీలు రీచ్ లోపలికి వెళ్లాయి.
ఇంకా చదవండి: 6 వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు? ఎవరెవరికి అంటే?
ఉద్దేశపూర్వకంగానే..:
వేమగిరి-1(బుర్రిలంక) ర్యాంపు కేటాయింపునకు వేసిన టెండరు తిరస్కరణకు గురికావడంతో గుత్తేదారు కోర్టుకు వెళ్లారని చెబుతున్నారు. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చేలోగా ఉన్నంతలో దోచుకునేందుకు కొందరు వేరే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే రాత్రివేళ తవ్వకాలు చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత రీచ్ల్లో కార్యకలాపాలు ఉండకూడదని నిబంధనలున్నా, రాత్రి తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. మైన్స్ ఏడీ దృష్టికి విషయం తీసుకెళ్లగా.. స్థానిక అధికారులను రీచ్ వద్దకు పంపిస్తామన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: