ఉచిత ఇసుక తవ్వకాల్లోనూ వైకాపా నాయకులు దాష్టీకానికి తెగబడ్డారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం ఇసుకరేవులో జరిగిన వివాదంలో అదే గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త తూమాటి రాజేంద్రప్రసాద్ను వైకాపా కార్యకర్తలు ట్రాక్టరుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బొమ్మువానిపాలెం రేవులో ఇసుక ఎగుమతుల్లో తమ ట్రాక్టరుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, వరుసలో పెట్టాలని చెప్పడం సరికాదని రాజేంద్రప్రసాద్ అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు దూసరి అనిల్, చినబాజి, తూమాటి అంజి ఆదివారం మధ్యాహ్నం వాగ్వాదానికి దిగారు. అనంతరం ట్రాక్టర్తో ఢీకొట్టి దాడికి పాల్పడ్డారు. గత వైకాపా ప్రభుత్వంలోనూ పలుమార్లు దాడికి పాల్పడగా.. కేసులు నమోదయ్యాయని, పాతకక్షతో మరోమారు దాడికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబీకులు వాపోయారు. తీవ్రంగా గాయపడిన రాజేంద్రప్రసాద్ను చికిత్స నిమిత్తం కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: