రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చేయడంతోపాటు, రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. దీంతో అన్ని జిల్లాల్లో రహదారుల పనులు మరింత వేగంగా చేసేందుకు అవకాశం ఏర్పడింది. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రోడ్లకు నిధుల కేటాయింపులో అంకెలగారడీతో మాయచేసింది. ముఖ్యంగా గుంతలు పూడ్చేందుకు కూడా సొమ్ములివ్వకుండా ప్రజలకు నరకయాతన చూపింది. న్యూడెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్బీ) రుణంతో చేపట్టే రోడ్ల విస్తరణకు కూడా రాష్ట్ర వాటా ఇవ్వకుండా.. ఆ ప్రాజెక్టు రద్దయ్యే పరిస్థితి తెచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. గుంతల రహిత రాష్ట్రం అనే కార్యక్రమం చేపట్టి, సంక్రాంతి నాటికి రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తోంది. గుత్తేదారులకు రూ. 600 కోట్ల మేర గత జగన్ ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం చెల్లించి, అన్ని ప్రాజెక్టుల్లో పనులు మొదలయ్యేలా చూసింది. ఇప్పుడు 2024-25 బడ్జెట్లో సైతం పెద్దఎత్తున రోడ్లకు నిధులు కేటాయించి, రహదారుల పనులను మరింత వేగంగా చేసేందుకు అవకాశం కల్పించింది. బడ్జెట్లో ఆర్అండ్్బ, రవాణా, ప్రజా రవాణాశాఖ (పీటీడీ)లకు కలిపి రూ. 9,554 కోట్లు కేటాయించారు.
ఇంకా చదవండి: మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
'ఎన్డీబీ' రోడ్లకు నిధులు
గ్రామీణ రోడ్లకు రూ. 721.78 కోట్లు కేటాయించారు. ఇందులో మండల కేంద్రాల మధ్య, మండల- జిల్లా కేంద్రాల మధ్య అనుసంధానం చేసేలా ఎన్డీబీ రుణంతో చేపడుతున్న రోడ్లకు రూ. 541.67 కోట్లు కేటాయించారు. గత వైకాపా ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుకు 2023-24లో ఏకంగా రూ. 1,232 కోట్లు కేటాయించినా, ఖర్చుచేసింది కేవలం రూ.111.17 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఇస్తున్న ప్రాధాన్యం చూసి.. ఎన్డీబీ కూడా రూ.770 కోట్ల విడుదలకు సిద్ధమవుతోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: