Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే?

జగన్ అన్నగారూ ఏపీ అభివృద్ధి చూపిస్తారా?? కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాం: ష‌ర్మిల

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌ గా నియ‌మితురాలైన వైఎస్ ష‌ర్మిల జిల్లాల ప‌ర్య‌ట‌న ప్రారంభించారు. సోమవారం ఆమె ప్ర‌క‌టించిన&zwnj

Published : 2024-01-23 14:53:00

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌ గా నియ‌మితురాలైన వైఎస్ ష‌ర్మిల జిల్లాల ప‌ర్య‌ట‌న ప్రారంభించారు. సోమవారం ఆమె ప్ర‌క‌టించిన‌ట్టుగానే ఎన్నిక‌ల‌కు ముందు ఆమె జిల్లాల్లో ప‌ర్య‌టించి.. కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. తొలుత ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోని కీల‌క‌మైన శ్రీకాకుళం నుంచి ష‌ర్మిల త‌న యాత్ర‌ను ప్రారంభించారు.

జిల్లాలోని పలాస నియోజ‌క‌వ‌ర్గంలో ఆర్టీసీ బస్సు ఎక్కిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఇచ్ఛాపురం వ‌ర‌కు బ‌స్సులోనే ప్ర‌యాణించారు.సాధార‌ణ ప్ర‌యాణికుల మాదిరిగా వారి ప‌క్క‌నే కూర్చున్న ష‌ర్మిల రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తోపాటు.. వారి స‌మ‌స్య‌లను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్ర‌జ‌ల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌, ఏపీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్ర‌రాజు, మాజీ మంత్రి ర‌ఘువీరా రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా వైఎస్ ష‌ర్మిల ను మీడియా ప‌ల‌క‌రించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఉత్త‌రాంధ్ర జిల్లాల ఇంచార్జి Y.V.సుబ్బారెడ్డి ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి లేద‌న్న ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న కౌంట‌ర్ ఇస్తూ.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఎంతో అభివృద్ధి చేసింద‌ని, ఎవ‌రు వ‌చ్చినా.. అభివృద్ది ఎక్క‌డ ఎలా జ‌రిగిందో చూపిస్తామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అదేవిధంగా జ‌గ‌న్‌రెడ్డి అని సంబోధించ‌డాన్ని వైవీ త‌ప్పుబ‌ట్టారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ష‌ర్మిల స్పందిస్తూ.సుబ్బారెడ్డి గారు. జగన్ రెడ్డిగారు అనటం న‌చ్చ‌లేదంటున్నారు. సరే జగన్ అన్నగారూ అనే అందాము. దానికి ఏమీ అభ్యంతరం లేదు అని వ్యాఖ్యానించారు.

ఇక‌, వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రంలో అభివృద్ది చూపిస్తామ‌న్న వ్యాఖ్య‌ల‌పై వైఎస్ ష‌ర్మిల స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి గారు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపిస్తామన్నారు. మేము చూడటానికి సిద్దంగా ఉన్నాం. టైం,డేట్ మీరు చెప్పిన సరే,మమ్మల్ని చెప్పమన్నా సరే రెడీ.

మీరు చేసిన అభివృద్ధి చూసేందుకు మేమే కాదు, మీడియా, మేధావులు, ప్రతిపక్ష పార్టీల వారు కూడా వస్తారు. మీరు చేపట్టిన అభివృద్ధి, మీరు నిర్మించిన రాజధాని ఎక్క‌డ‌, మీరు క‌ట్టిన పోలవరం ప్రాజెక్టు ఎక్క‌డ‌? మీరు నడుపుతున్న మెట్రో ఎక్క‌డో చూపించండి. చూడటానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నాం. చూపించండి అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →