SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Anna Canteens: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు..! ఉగాది నుంచి పేదలకు పౌష్టికాహారం! RTC Depots: ఏపీలో వారికి శుభవార్త! కొత్తగా రెండు RTC డిపోలు...100 ఎలక్ట్రిక్ బస్సులు! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Anna Canteens: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు..! ఉగాది నుంచి పేదలకు పౌష్టికాహారం! RTC Depots: ఏపీలో వారికి శుభవార్త! కొత్తగా రెండు RTC డిపోలు...100 ఎలక్ట్రిక్ బస్సులు!

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం...

ఆగిరిపల్లి:   నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నెలకొంది. ప్రకాశం, ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదాల్లో ఐదుగురు స్నేహితులు మృతిచెందారు. ఎదిగొ

Published : 2024-01-02 10:36:00

ఆగిరిపల్లి:   నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నెలకొంది. ప్రకాశం, ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదాల్లో ఐదుగురు స్నేహితులు మృతిచెందారు. ఎదిగొచ్చిన కుమారులు మృతిచెందడంతో ఆయా కుటుంబాలను ఓదార్చడం ఎవరితరం కాలేదు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం పాపాయిపల్లె గ్రామానికి చెందిన నల్లబోతుల పవన్‌(20), నల్లబోతుల శ్రీనివాస్‌(21), పిక్కిల్‌ రాహుల్‌(21) స్నేహితులు. వీరు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని అనంతరం సోమవారం వేకువజామున 4 గంటల సమీపంలో టీ తాగేందుకు బేస్తవారపేట నుంచి జాతీయ రహదారిపై ఉన్న పందిళ్లపల్లి టోల్‌ప్లాజా వద్దకు బయలుదేరారు.

మార్గమధ్యలో చెట్టిచర్ల బస్టాండ్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం బైకు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా బైకు నుంచి మంటలు చెలరేగి రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. మోటార్‌సైకిల్‌పై ఉన్న పవన్‌ ఘటనా స్థలంలోనే మంటల్లో చిక్కుకొని మృతిచెందాడు. మిగిలిన ఇద్దరు రోడ్డుపక్కన పడి మృతిచెందారు. మరో ఘటనలో ఎన్టీఆర్‌ జిల్లా నున్నకు చెందిన శెట్టి సాయికుమార్‌, నున్న రాకేష్‌ స్నేహితులు. నూతన సంవత్సరం సందర్భంగా రాకేష్‌ సమీప బంధువు అయిన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లికి చెందిన ఓ వ్యక్తి మామిడితోటలో వేడుకలు జరుపుకొనేందుకు తమతో పాటు విజయవాడ మొగల్రాజపురానికి చెందిన తలశిల కృష్ణచైతన్యను తీసుకువెళ్లారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

పార్టీ అనంతరం సోమవారం ఉదయం ఇళ్లకు బయల్దేరారు. ఈ క్రమంలో గేదెలు అడ్డురావడంతో తప్పించే ప్రయత్నంలో సమీపంలోని నేలబావిలోకి వీరి బైక్‌ దూసుకుపోయింది. పార్టీలో పాల్గొని వీరి వెనుకే వస్తున్న మరో ఇద్దరు అక్కడే పొలంలో ఉన్న వారికి సమాచారం ఇవ్వడంతో వారు రాకే్‌షను బావి నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కృష్ణచైతన్య(24), సాయికుమార్‌(24) బావిలోనే మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు నేలబావి నుంచి నీటిని బయటకు తోడించి మృతదేహాలను, ద్విచక్ర వాహనాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం వీరి మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఎస్సై చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →