రాజధాని అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు సరఫరా కోసం నిర్మించిన 400/220కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ (జీఐఎస్) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ కేంద్రాన్ని రాజధాని ప్రాంతంలోని తాళ్లాయపాలెంలో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ప్రారంభించనున్నారు. రాజధాని ప్రాంతానికి ఇప్పటివరకు 220/132/33కేవీ తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. అమరావతి నిర్మాణం జరుగుతున్నందున భవిష్యత్తులో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్తు సరఫరాకు ఇప్పట్నుంచే ప్రణాళికాయుతంగా ముందుకెళుతున్నారు. ప్రస్తుతం తాళ్లాయపాలెం వద్ద నిర్మించిన 400/220కేవీ విద్యుత్తు కేంద్రం పక్కనే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
ఇంకా చదవండి: ఏపీకి అదిరిపోయే శుభవార్త.. మన సీఎం ఐడియా వారెవ్వా! కేంద్రం మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లా ప్రజలు ఎగిరి గంతేయాల్సిందే!
ఇక్కడి నుంచి నేలపాడులో నిర్మించే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రానికి సరఫరా చేస్తారు. తాడేపల్లిలోని 132 కేవీ కేంద్రాన్ని 220కేవీగా అప్గ్రేడ్ చేసి తాళ్లాయపాలెం జీఐఎస్ నుంచి సరఫరా తీసుకుంటారు. వీటి ద్వారా రాజధానిలోని అన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా అవుతుంది. తాడికొండ విద్యుత్తు కేంద్రానికి ఇవి ప్రత్యామ్నాయం కానున్నాయి. అటు తాడికొండ, ఇటు తాళ్లాయపాలెం 220/33కేవీ విద్యుత్తు కేంద్రాల నుంచి రాజధాని ప్రాంతానికి విద్యుతు సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలతోపాటు పరిశ్రమలకూ అంతరాయం లేని విద్యుత్తు సరఫరాకు తోడ్పడుతుంది. తాళ్లాయపాలెం జీఐఎస్ కేంద్రం నుంచి రాజధాని అమరావతిలో నిర్మించబోయే 220/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాలకు సరఫరా చేస్తారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!
మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్‌లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: