మూడు పార్టీలు కూటమిగా కలిసి ఉన్నప్పుడు చిన్నపాటి సమస్యలు ఉంటాయని.. కూర్చొని మాట్లాడుకుంటే అవి పరిష్కారమవుతాయని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు ఇచ్చిన అనంతరం తొలిసారిగా ఆయన కాకినాడకు వచ్చారు. తెదేపా, జనసేన, భాజపా నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడారు. “కూటమి పార్టీల్లో ఎలాంటి కుమ్ములాటలు లేవు. సీఎం ఆదేశాల ప్రకారం మూడు పార్టీల సమన్వయంతో పాటు ప్రజా సమస్యలపై ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రత్యేక దృష్టి సారిస్తాను. ఎన్నికల కోడ్ ఉండటంతో అధికారులతో సమీక్ష నిర్వహించలేదు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు తమ నియోజకవర్గ అభివృద్ధిపైనే ఎక్కువగా చర్చించారు. రూ.10లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర ఖజానాను జగన్ ఖాళీ చేసి వెళ్లిపోయారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడేశారు. అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేశారు. తన అనుభవంతో సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖజానా ఖాళీ అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం. రాజధానిపై 2014 లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. ఏపీ రాజధాని అమరావతే అని కేంద్రం కూడా పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది. ఇన్చార్జ్ మంత్రిగా కాకినాడ జిల్లాకు నెలకు మూడుసార్లు వస్తాను. అన్ని సమస్యలు పరిష్కరిస్తాను. పెండింగ్లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించాను” అని నారాయణ తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మటన్‌తో కలిపి ఈ 3 పదార్థాలు తింటున్నారా? ఇక మీ ఆయుష్షు మూడినట్లే! దీని మాంసం మానవ శరీరానికి చాలా!
సొంత పార్టీ జూనియర్ మంత్రిపై చంద్రబాబు సీరియస్? ఆడియో కాల్ వైరల్! ఈ ఐదు నెలల్లో ప్రభుత్వ!
జగన్ కు భారీ షాక్! పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!
11వ నెల 11వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ 11 మంది వస్తారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
అమరావతి టవర్ల నిర్మాణానికి మళ్ళీ ఉపిరి! ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న కసరత్తు!
దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్, ఈ ఛాన్స్ వదలొద్దు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: