విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని, ఇందుకోసం దీటైన కార్యాచరణతో ప్రభుత్వం ముందుకెళ్తాందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఎంతమందికి డిగ్రీలు ఇచ్చామన్నది లెక్క కాకూడదని, ఎంతమందికి కొలువులు సాధించి పెట్టామన్నదే విద్యా సంస్థల లక్ష్యం కావాలన్నారు. అమరావతి విట్-ఏపీ విశ్వవిద్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిరు లోకేశ్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి కీలకోపన్యాసం చేశారు. 'తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము కానీయకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి. సవాళ్లకు భయపడకూడదు' అని చెప్పారు.
ఉద్యోగాలు సృష్టించాలి...: 'ఉద్యోగాలు చేసేవారుగా కాకుండా వాటిని సృష్టించేవారుగా విద్యార్థులు ఎదగాలి. స్టార్టప్లు ప్రారంభించేవారికి ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ తరపున సంపూర్ణ సహకారం అందిస్తాం. అందుకు రూ.250 కోట్లతో నిధి ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి. అమరావతిని సకల సౌకర్యాలతో ప్రపంచంలోనే గొప్ప రాజధాని నగరంగా నిర్మించాలన్నదే మా లక్ష్యం. ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి' అని లోకేశ్ చెప్పారు. విట్ ఏపీ ఛాన్సలర్ డాక్టర్ విశ్వనాథన్ మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు నేతృత్వంలో లోకేశ్ సహకారంతో రాష్ట్రంలో విద్యారంగం బాగా విస్తరిస్తోందన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!
టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్!
వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!
నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!
మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్‌లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: