‘దీపం 2.0' కేవలం వంటింట్లో వెలుగు కోసం మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు తీసుకురావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఏలూరు జిల్లా జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు. “ప్రజలు మాపై భరోసాతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చేసి మాపై ఎంతో బాధ్యత పెట్టారు. వైకాపా చేసిన దోపిడీ కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తాయి. వైకాపాను ప్రజలు తరిమికొట్టినా, కేవలం 11 సీట్లకే పరిమితమైనా వారి నోళ్లు ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఏది పడితే అది మాట్లాడుతాం అంటే మాత్రం చూస్తూ ఊరుకోం. మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని వైకాపా నేతలు గుర్తు పెట్టుకోవాలి. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రతి విషయాన్ని గమనిస్తోంది. ఆడబిడ్డల భద్రత విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటాం.
షర్మిలకు రక్షణ కల్పిస్తాం..
జగన్ సోదరి షర్మిల.. 'నా ప్రాణాలకు రక్షణ కావాలి. అదనంగా సెక్యూరిటీ కల్పించాలి అని అడిగారు. అమ్మా.. మీ అన్న కల్పించలేకపోయాడేమో కానీ.. మీ ప్రాణాలకు కూటమి ప్రభుత్వం రక్షణగా ఉంటుంది. ఒక బాధ్యతగల నాయకురాలిగా మీరు ఎన్ని విమర్శలైనా చేయొచ్చు. మీరు అప్పీల్ చేసుకోండి.. సీఎం దృష్టికి తీసుకెళ్లి మీకు రక్షణ కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: