'ఎన్డీయే అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 40వేల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. శాసనసభ్యుల డిమాండ్ దృష్ట్యా మరిన్ని ఇస్తాం. ట్రాన్స్ఫార్మర్లు, మెటీరియల్కు టెండర్లు పిలిచాం. అవసరమైనచోట సబ్ స్టేషన్లు నిర్మిస్తాం' అని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం (రెండో సవరణ) బిల్లు-2024పై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. అనంతరం ఈ బిల్లును సభ ఆమోదించింది. మంత్రి రవికుమార్ మాట్లాడుతూ 'చంద్రబాబు 2019లో మిగులు విద్యుత్తుతో రాష్ట్రాన్ని జగన్కు అప్పగించారు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం ఒక్క మెగావాట్ కూడా కొత్తగా ఉత్పత్తి చేయలేదు. ఆ ప్రభుత్వంపై నమ్మకం లేక పెట్టుబడిదారులంతా వెళ్లిపోయారు. ఒప్పందాలు రద్దు చేసుకోవాలంటూ వారిని మారణాయుధాలతో భయపెట్టారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వ్యవసాయ విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు అదనపు ఖర్చు కాకుండా చూస్తాం. ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమకు రాయితీలిచ్చే అంశం పరిశీలనలో ఉంది. ఫైలు ముఖ్యమంత్రికి పంపాం' అని మంత్రి వివరించారు.
ఇంకా చదవండి: కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిసిన వివేకా కుమార్తె డాక్టర్ సునీత! హోంమంత్రి అనితను కలిసిన సమయంలో!
జగన్ విధానాలను తూర్పారబట్టిన ఎమ్మెల్యేలు
చర్చలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ '2019లో జగన్ అధికారంలోకి రాగానే ప్రజల నడ్డి విరిచారు. అనేకసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అంతకుముందు రూ.వెయ్యి బిల్లు చెల్లించేవారు ఈ ఐదేళ్ల పాలనలో రూ.4వేల చొప్పున కట్టాల్సిన దుస్థితికి తెచ్చారు. అవసరమైన మేర కొత్తగా 220 కేవీ సబ్స్టేషన్లు నిర్మించలేదు' అని విమర్శించారు. భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ 'జగన్ హయాంలో జరిగిందంతా విధ్వంసమే. 30 ఏళ్లు అమల్లో ఉండాల్సిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. అంతమంది సలహాదారులుండి, రాష్ట్రానికి నష్టం కలిగించే ఇలాంటి సలహాలు ఇచ్చినందుకు వాళ్లు పొందిన జీతాలన్నీ రివకరీ చేయాలి' అన్నారు. జగన్ అమలుచేసిన విద్యుత్ విధానాలు, పీపీఏల రద్దువల్ల ప్రజలపై భారం పడటంతో పాటు పెట్టుబడిదారుల ముందు రాష్ట్రం చులకనైపోయిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. త్వరగా హరిత విద్యుత్కు మారాల్సి ఉందని, ఇందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట్లాడుతూ జగన్ హయాంలో ప్రజలు ఉంగరాలు, బంగారు నగలు అమ్ముకుని విద్యుత్ బిల్లులు కట్టారని వాపోయారు. వైకాపా ఓటమికి విద్యుత్ బిల్లుల భారమూ కీలక కారణమని విశ్లేషించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: