PM Modi: తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను... ఈసారి వచ్చేది బీజేపీనే.. Modi: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం.. రైల్వేలు, రహదారులు, ఉద్యోగాల్లో భారీ పురోగతి! PM Modi: అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్‌ కేరాఫ్ అడ్రస్.. బెంగళూరు సభలో ప్రధాని నిప్పులు! Chandrababu: చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న భేటీ! Vangalapudi Anitha: మదర్స్ డే వేడుకల్లో వృద్ధ మహిళలతో మమేకమైన హోం మంత్రి అనిత! Nara Lokesh: సింగపూర్‌లో మంత్రి లోకేష్ బిజీ బిజీ.. కీలక కంపెనీల సీఈవోలతో వరుస భేటీలు! షెడ్యూల్ ఇదే.. Tamil Nadu Politics: ఏపీలో టీడీపీ కోసం పనిచేసి... ఇప్పుడు విజయ్ క్యాబినెట్ లో మంత్రి అయింది.. ఎవరు అంటే..? Vijay: ఎంతటి ప్రయాణం.. ఎంతటి రాజకీయ నాటకం! సీఎం విజయ్‌కు రేవంత్ రెడ్డి, మంచు విష్ణు శుభాకాంక్షలు.. Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు! PM Modi: తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. అభివృద్ధిలో కలిసి నడుస్తామని హామీ! PM Modi: తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను... ఈసారి వచ్చేది బీజేపీనే.. Modi: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం.. రైల్వేలు, రహదారులు, ఉద్యోగాల్లో భారీ పురోగతి! PM Modi: అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్‌ కేరాఫ్ అడ్రస్.. బెంగళూరు సభలో ప్రధాని నిప్పులు! Chandrababu: చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న భేటీ! Vangalapudi Anitha: మదర్స్ డే వేడుకల్లో వృద్ధ మహిళలతో మమేకమైన హోం మంత్రి అనిత! Nara Lokesh: సింగపూర్‌లో మంత్రి లోకేష్ బిజీ బిజీ.. కీలక కంపెనీల సీఈవోలతో వరుస భేటీలు! షెడ్యూల్ ఇదే.. Tamil Nadu Politics: ఏపీలో టీడీపీ కోసం పనిచేసి... ఇప్పుడు విజయ్ క్యాబినెట్ లో మంత్రి అయింది.. ఎవరు అంటే..? Vijay: ఎంతటి ప్రయాణం.. ఎంతటి రాజకీయ నాటకం! సీఎం విజయ్‌కు రేవంత్ రెడ్డి, మంచు విష్ణు శుభాకాంక్షలు.. Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు! PM Modi: తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. అభివృద్ధిలో కలిసి నడుస్తామని హామీ!

చింతలపూడి ఎత్తిపోతల పథకంతో నూజివీడు మెట్ట ప్రాంతం సస్యశ్యామలం...

చింతలపూడి ఎత్తిపోతల పథకంతో నూజివీడు మెట్ట ప్రాంతం సస్యశ్యామలం ఈనెల 5న చింతలపూడిలో జరిగే "రా... కదలి రా" సభను జయప్రదం చేయండి   నూజివీడులో జరిగిన సన్నాహక

Published : 2024-02-02 19:31:00

చింతలపూడి ఎత్తిపోతల పథకంతో నూజివీడు మెట్ట ప్రాంతం సస్యశ్యామలం

ఈనెల 5న చింతలపూడిలో జరిగే "రా... కదలి రా" సభను జయప్రదం చేయండి

నూజివీడులో జరిగిన సన్నాహక సమావేశంలో వెల్లడించిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాక్య రాష్ట్ర నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు

నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల మెట్ట ప్రాంతంలో ఉన్న 50 వేల ఎకరాలు రాబోయే చింతలపూడి ఎత్తిపోతల పథకంతో సత్య శ్యామల మవ్వబోతున్నదని సీనియర్ టిడిపి నేత,సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు అన్నారు.

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు దిశా నిర్దేశంతో ఏలూరుపార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఈనెల 5వ తేదీన చింతలపూడి లో జరిగే "రా... కదలిరా..." సభను జయప్రదం చేసే నిమిత్తం ఈరోజు ఉదయం నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ సమావేశంలో రాష్ట్ర టిడిపి పరిశీలకులుగా హాజరైన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ... నాగార్జున సాగర్ యడమ కాలువ మూడవ జోన్ లో చివరి ప్రాంతానికి సాగునీరు రాని పరిస్థితిలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గోదావరి జలాలను ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు, మైలవరం, గన్నవరం, నందిగామ తో పాటు నూజివీడు మెట్ట ప్రాంతానికి తీసుకురావడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించి రూ.4,909 కోట్లు మంజూరు చేసి 2019 నాటికి రూ.3,450 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పూర్తి చేయడం జరిగింది.

ప్రస్తుత వై.సి.పి ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించి పనులు నిలుపుదల చేయటం వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు లక్షల కోట్ల పంటలను నష్టపోయారని, ఈ పథకం పూర్తయినట్లయితే నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి మండలాల్లోని 50 వేల ఎకరాల్లో మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అయ్యేదని, ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 5వ తేదీన చింతలపూడిలో జరిగే "రా...కదిలి రా" సభకు నూజివీడు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రైతులు,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై రాబోయే శాసనసభ ఎన్నికల్లో తిరిగి నారా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిని చేసి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత నూజివీడు నియోజకవర్గ ప్రజలందరిమీద ఉన్నదని తెలియజేశారు.

ఈ సమావేశంలో నూజివీడు నియోజకవర్గ రా.. కదలిరా... సభా పరిశీలకులు, మచిలీపట్నం మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు,నూజివీడు నియోజకవర్గ పరిశీలకులు గింజుపల్లి రమేష్ వివిధ మండలాల పరిశీలకులు దొంతు చిన్నా, చిరుమామిళ్ల సూర్యం తదితరులు ప్రసంగించి చింతలపూడి రా.. కదలిరా... సభను జయప్రదం చేయడానికి నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు దశ దిశ నిర్దేశం చేశారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →