Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై..

సీఆర్డీఏ చేతిలో కనీసం 5వేల ఎకరాలు! కేంద్ర సంస్థల భవిష్యత్ ప్రణాళికలపై చర్చ!

రాజధాని అమరావతిలో వివిధ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు భూములు కేటాయించేటప్పుడు వాటికి వాస్తవంగా ఎంత అవసరమో చూడాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. కావలస

Published : 2024-11-16 08:01:00

రాజధాని అమరావతిలో వివిధ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు భూములు కేటాయించేటప్పుడు వాటికి వాస్తవంగా ఎంత అవసరమో చూడాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. కావలసిన దానికంటే ఎక్కువ ఇచ్చుకుంటూ పోతే ఇతర అవసరాలకు భూమి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. భవిష్యత్తులో రాజధాని నిర్మాణ అవసరాలకు కనీసం 5వేల ఎకరాలు సీఆర్డీఏ అధీనంలో ఉండాలన్న చర్చ జరిగింది. రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఆరుగురు మంత్రులతో కూడిన ఉపసంఘం సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. వివిధ కేంద్రప్రభుత్వ సంస్థలు ఇతర రాష్ట్రాల్లో ఎంత విస్తీర్ణంలో వాటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయో చూసి, అదే దామాషాలో రాజధానిలోనూ భూములు కేటాయించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. 2014-19 మధ్య అమరావతిలో ఏయే సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి, ఎంత భూమి, ఏ ప్రాతిపదికన కేటాయించారు, ఇంకా ఎంత భూమి ఉంది.. అనే వివరాల్ని సీఆర్డీఏ అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు. ఆ సంస్థల పరిస్థితేంటి, ఎప్పటిలోగా పనులు మొదలుపెడతాయన్న అంశాలపై వాటితో సంప్రదింపులు జరపాల్సిందిగా సీఆర్డీఏ అధికారుల్ని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. గతంలో సుమారు 130 సంస్థలకు భూములు కేటాయించామని, వాటిలో ఐదారు తప్ప మిగతా సంస్థలు నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ వివరించారు.



ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14



రాజధానిలో భూ కేటాయింపుల కోసం కొత్తగా మరో నాలుగైదు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయని ఆయన వివరించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన వంటివి వాటిలో ఉన్నట్టు తెలిపారు. ప్రతి వారం పదిరోజులకు ఒకసారి సమావేశమై రాజధానిలో భూ కేటాయింపులపై సమీక్షించాలని ఉపసంఘం నిర్ణయించింది. సమావేశంలో మంత్రులు పి.నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, కందుల దుర్గేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మళ్లీ నమ్మకం వచ్చింది: నారాయణ
గత ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడటంతో అమరావతిలో నిర్మాణాలు చేసేందుకు ఏ సంస్థలూ ముందుకు రాలేదని మంత్రి నారాయణ అన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి రాజధాని పనుల్ని వేగవంతం చేయడంతో మళ్లీ వాటిల్లో నమ్మకం ఏర్పడిందని తెలిపారు. ‘అమరావతికి వస్తామని, నిర్మాణాలు ప్రారంభిస్తామని ఆయా సంస్థలు చెబుతున్నాయి. ఏయే సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి? గతంలో వాటికి కేటాయించిన భూములు ఎంత? వంటి అంశాల్ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. వచ్చే వారం మళ్లీ సమావేశమవుతాం” అని సమావేశం అనంతరం నారాయణ వివరించారు. రాజధానిలో వివిధ పనులకు టెండర్లు ఆమోదం పొందుతామని, తర్వాత కొత్త టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. "గత ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టడంతో నిర్మాణాలు ప్రారంభించేందుకు ఏ సంస్థా ముందుకు రాలేదు. వాటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు, పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు వంటివి ఉన్నాయి. వారందరినీ పిలిచి మాట్లాడి, ఒక ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించాం" అని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!

ఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి!

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకుఎప్పుడు అంటే?

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


Spotlight

Read More →