మీరు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారైతే.. రెడీగా ఉండండి.. ఎనీటైమ్ సచివాలయ ఉద్యోగులు మీ ఇంటికి రావచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మీతో మాట్లాడవచ్చు. మీకు తెలుసుగా.. సీఎం చంద్రబాబు అంటే.. టెక్నాలజీని వాడుకోవడంలో కింగ్. ఆయనకు IVRS - ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యడం చాలా ఇష్టం. అదేవిధంగా.. వర్క్ ఫ్రమ్ హోమ్ అంశంపై కూడా సర్వే చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆమధ్య ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్‌పై నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్వయంగా ట్వీట్ చేశారు. కంపెనీలు.. గ్రామాల్లో పెట్టుబడులు పెట్టేలా.. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేసేలా ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తూ.. ఇప్పుడు సర్వే చెయ్యబోతున్నారు.
ప్లాన్ ప్రకారం.. మార్చి 1 నుంచి సచివాలయ ఉద్యోగులు.. ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారు. ఇళ్లలోని 18 నుంచి 50 ఏళ్ల లోపు వారు ఏం చదువుకున్నారో, ఏయో స్కిల్స్ వారికి తెలుసో, తెలుసుకుంటారు. ప్రస్తుతం ఏం పని చేస్తున్నారో వివరాలు తీసుకుంటారు. ఇలా మార్చి 10 వరకూ ఈ సర్వే జరుగుతుంది. తద్వారా ఏపీ ప్రజల స్కిల్ ఇన్ఫర్మేషన్, డేటా వివరాలు ప్రభుత్వం దగ్గరకు వచ్చేస్తాయి.
ఈ సర్వేలో భాగంగా.. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యడం ఇష్టమేనా అని కూడా అడుగుతారు. ఇష్టమే అని చెబితే.. అలా ఎంత మంది చెప్పారో చూస్తారు. ఎక్కువ మంది ఇష్టమే అని చెబితే.. ప్రభుత్వం ఈ దిశగా మరింత ముందుకు వెళ్తుంది. ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నవారికి సైతం.. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించేలా కంపెనీలతో మాట్లాడాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి: వల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సర్వేలో ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యడానికి ఇష్టపడితే.. అప్పుడు జిల్లాల్లో చాలా చోట్ల వర్క్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ స్టేషన్ల దగ్గర బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది. అలాగే.. వర్క్ చేసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లూ ఉంటాయి. అంటే.. ఉద్యోగులు కంపెనీలకు వెళ్లాల్సిన పని లేకుండా.. వర్క్ స్టేషన్లలో పనిచేసుకోవచ్చు.
ఆఫీసుకి వెళ్లి వర్క్ చెయ్యడం అనేది పాత విధానం. ఇంట్లోనే ఉండి వర్క్ చెయ్యడం అనేది కొత్త విధానం అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. పాత విధానాలకు స్వస్తి పలికి.. కొత్త టెక్నాలజీవైపు అడుగులు వెయ్యాలి అంటోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కంపెనీలకూ మేలే అంటోంది. ఆఫీసు అద్దె, ఇంటర్నెట్, ఏసీ, వాటర్, సర్వీసింగ్, సెక్యూరిటీ ఇలా చాలా ఖర్చులు తగ్గిపోతాయి. వర్క్ ఫ్లో ఎలాగూ నడుస్తూనే ఉంటుంది. ఉద్యోగులు కూడా సొంత ఊళ్లోనే ఉంటూ పనిచేస్తారని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.
ఏపీకి చెందిన చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు విదేశాల్లో పనిచేస్తున్నాయి. ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరులో కూడా పనిచేస్తున్నారు. వారిలో చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాలని ఉన్నా, కంపెనీలు ఒప్పుకోవట్లేదు. కానీ ఏపీ ప్రభుత్వం కంపెనీలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. అన్నీ సక్రమంగా జరిగితే, ఈ సంవత్సరం చివరి నాటికే.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు మొదలవుతాయి అనుకోవచ్చు.
ఇది కూడా చదవండి:
వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!
మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!
ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!
ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: