Iconic Towers: అమరావతి ఐకానిక్ టవర్లకు రక్షణ కవచం... డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ప్రత్యేకతలు! భూకంపాలను సైతం... Amaravati Flood Prevention: అమరావతి వరద నివారణ ప్రాజెక్ట్ అప్‌డేట్... 100 ఏళ్ల వరదను...! ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం.... AP Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... విద్యార్థులకు 11 రకాల వైద్య పరీక్షలు! ఎందుకంటే! Praja Vedika: నేడు (15/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati Development: అమరావతి ఇక ఏకైక రాజధానిగా విశ్వరూపం... రూ. 56,000 కోట్ల భారీ ప్యాకేజీ! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Iconic Towers: అమరావతి ఐకానిక్ టవర్లకు రక్షణ కవచం... డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ప్రత్యేకతలు! భూకంపాలను సైతం... Amaravati Flood Prevention: అమరావతి వరద నివారణ ప్రాజెక్ట్ అప్‌డేట్... 100 ఏళ్ల వరదను...! ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం.... AP Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... విద్యార్థులకు 11 రకాల వైద్య పరీక్షలు! ఎందుకంటే! Praja Vedika: నేడు (15/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati Development: అమరావతి ఇక ఏకైక రాజధానిగా విశ్వరూపం... రూ. 56,000 కోట్ల భారీ ప్యాకేజీ! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా!

Ambati Rambabu Pushpa Stunt: తగ్గేదే లేదన్న అంబటి.. తగ్గేలా చేసిన కోర్టు తీర్పు.. లక్కీ డ్రా కేసులో 14 రోజుల రిమాండ్!

Ambati Rambabu Sankranthi Lucky Draw Case: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టులో భారీ షాక్! సంక్రాంతి లక్కీ డ్రా కేసులో 14 రోజుల రిమాండ్. జైలు నుంచి రాగానే 'పుష్ప' స్టంట్లు చేసిన అంబటికి మళ్లీ జైలు తప్పలేదు.

Published : 2026-02-12 17:43:00

Ambati Rambabu Pushpa Stunt: ‘తగ్గేదే లేదు’ అంటూ అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బుద్ధా వెంకన్న

సత్తెనపల్లి లక్కీ డ్రా కేసు ముదిరింది… అంబటి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు

మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు కోర్టులో చుక్కెదురైంది. (Ambati Rambabu) సత్తెనపల్లి నియోజకవర్గంలో గతంలో నిర్వహించిన సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారం ఆయనను చిక్కుల్లోకి నెట్టింది. లక్కీ డ్రా పేరుతో టికెట్లను బలవంతంగా విక్రయించారనే ఆరోపణలపై నమోదైన కేసులో విచారణ జరిపిన స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు, అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కోర్టు వద్ద 'పుష్ప' స్టంట్లు..
అంబటి రాంబాబు కోర్టుకు హాజరయ్యే సమయంలో వ్యవహరించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విచారణకు వెళ్తూ 'పుష్ప' సినిమా తరహాలో మేనరిజం ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంబటి తీరును తప్పుబడుతూ, అవినీతి కేసుల్లో కోర్టుకు వెళ్తూ ఇటువంటి స్టంట్లు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.

తగ్గేదే లేదన్న బుద్ధా వెంకన్న
అంబటి రాంబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. "గడ్డాలు, మీసాలు మీకే కాదు.. మాకూ ఉన్నాయి. మేం కూడా ఎక్కడా తగ్గేది లేదు" అంటూ ఘాటుగా స్పందించారు. అంబటిపై అనేక అవినీతి కేసులు ఉన్నాయని, చట్టం ముందు ఎవరైనా సమానులేనని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, అంబటి తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

సత్తెనపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో (Ambati Rambabu Sankranthi Lucky Draw Case) పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, సామాన్య ప్రజలను, వ్యాపారులను టికెట్లు కొనాలని వేధించారనే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు లోతుగా విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. కోర్టు తాజా నిర్ణయంతో అంబటి రాంబాబు రాజకీయ భవిష్యత్తుపై  పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

Spotlight

Read More →