Nara Lokesh: విశాఖలో నారా లోకేష్ సందడి... విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన శ్రేణులు! APSRTC: అమరావతిలో 165 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్స్..! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం! Nara Lokesh: విశాఖలో నారా లోకేష్ సందడి... విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన శ్రేణులు! APSRTC: అమరావతిలో 165 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్స్..! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం!

Vizag Investments: విశాఖను ఐటీ క్యాపిటల్ చేస్తాం.. 99 పైసల భూకేటాయింపులపై మంత్రి లోకేష్ పవర్‌ఫుల్ కౌంటర్!

AP Council 99 Paisa Land Issue: విశాఖలో కంపెనీలకు భూముల కేటాయింపుపై ఏపీ శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఐదు ప్రముఖ కంపెనీలకు భూములిచ్చామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేయగా, వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు..

Published : 2026-02-12 12:57:00
  • Nara Lokesh Speech: శాసనమండలిలో లోకేష్ వర్సెస్ వైసీపీ..
     
  • 99 పైసల భూముల వెనుక అసలు కథ!

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా విశాఖపట్నంలో కంపెనీలకు భూముల కేటాయింపు అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. విశాఖను ఐటీ హబ్‌గా మార్చే క్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మంత్రి నారా లోకేష్  స్పష్టంగా వివరించగా భూముల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ సభ్యులు ఆరోపించారు.

99 పైసలకే భూములు.. మంత్రి లోకేష్ క్లారిటీ
విశాఖలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేవలం ఐదు ప్రముఖ కంపెనీలకు మాత్రమే 99 పైసలకే భూములిచ్చామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పరిశ్రమలు రావాలంటే భూములివ్వడం తప్పనిసరి. క్రెడిబిలిటీ  ఉన్న సంస్థలకే భూములిచ్చాం. ఎంఓయూలు కుదుర్చుకున్న తర్వాతే ఈ ప్రక్రియ జరిగింది అని  వెల్లడించారు. దేశానికి వచ్చే ప్రతి 100 రూపాయల పెట్టుబడిలో 26 రూపాయలు ఏపీకే వస్తోందని, ఇది కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్‌లో తక్కువ ధరకే భూములిచ్చారు కాబట్టే, నేడు అది ఐటీలో అగ్రస్థానంలో ఉందని, విశాఖను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

రహేజాకు భూములకు ఘాటైన సమాధానం.
వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు జోక్యం చేసుకుంటూ.. రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన రహేజాకు భూములు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనికి బొత్స సత్యనారాయణ మద్దతు తెలుపుతూ, ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ, రహేజా బిల్డింగ్స్‌లో అనేక ఐటీ కంపెనీలు వస్తున్నాయని, దానివల్ల వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. సంబంధం లేని ప్రశ్నలతో సభను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.

వైసీపీపై లోకేష్ నిప్పులు
వైసీపీ హయాంలో ఒక్క కంపెనీనైనా రాష్ట్రానికి తీసుకొచ్చారా? అని మంత్రి లోకేష్ నిలదీశారు. 2019-24 మధ్య పెట్టుబడిదారులను వేధించి తరిమేశారు. ఇప్పుడు మేము టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను తెస్తుంటే అడ్డుకుంటున్నారు. ఏపీకి పరిశ్రమలు రాకూడదని వైసీపీ కంకణం కట్టుకుంది అని మండిపడ్డారు. ఉర్సా కంపెనీకి భూములిచ్చామని నిరూపించగలరా అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి సవాల్ విసిరారు. సమాధానం వినే ఓపిక లేక ప్రతిపక్షం గందరగోళం సృష్టిస్తోందని ధ్వజమెత్తారు.

ఉత్తరాంధ్రకు ఆర్సిలర్ మిట్టల్
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఆర్సిలర్ మిట్టల్ ప్రాజెక్ట్ ఇక్కడికి రాబోతోందని మంత్రి లోకేష్ ప్రకటించారు. విశాఖను ఐటీ క్యాపిటల్ చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.

Spotlight

Read More →