AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన! Chandrababu: ప్రపంచ వేదికపై ఏపీ రొయ్య రారాజు కావాలి- సీఎం చంద్రబాబు! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన! Chandrababu: ప్రపంచ వేదికపై ఏపీ రొయ్య రారాజు కావాలి- సీఎం చంద్రబాబు!

Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు!

Mahanadu: న్యూజిలాండ్‌లో ఎన్నారై టీడీపీ అధ్యక్షురాలు మమత గారపాటి ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రవాసాంధ్రుల పోరాటాన్ని అభినందించారు. చంద్రబాబు నాయుడు గారి విజనరీ ప్లాన్స్, ఎన్డీయే కూటమి సహకారంతో ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోందని, అలాగే న్యూజిలాండ్ రాజకీయ ప్రతినిధులు సైతం ఏపీ సీఎం నాయకత్వాన్ని కొనియాడడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

Published : 2026-06-06 10:26:00

Politics- ప్రవాసాంధ్రుల పోరాట స్ఫూర్తి అమోఘం…

రిజిస్టర్డ్ ఛారిటీగా ఎన్టీఆర్ ట్రస్ట్.. అన్నగారి ఆశయాల సాధనే ధ్యేయం!

జితేంద్ర, వేణు, దిలీప్ నయా సంకల్పం.. పేదల సేవకై రంగంలోకి ఎన్టీఆర్ ట్రస్ట్!

Mahanadu: న్యూజిలాండ్‌లో నివసిస్తున్న తెలుగువారంతా ఒకచోటికి చేరి తెలుగుదేశం పార్టీ వార్షిక ఉత్సవమైన మహానాడు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎన్నారై టీడీపీ న్యూజిలాండ్ టీమ్, ఎన్నారై టీడీపీ అధ్యక్షురాలు మమత గారపాటి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సుదూర దేశంలో జరిగిన ఈ పసుపు పండుగకు తెలుగు సంస్కృతి, రాజకీయ చైతన్యం ఉట్టిపడేలా భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. ఈ వేడుకలకు విజయనగరం పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ మహానాడు వేడుకల్లో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతిని ఒక్కతాటిపైకి తెచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకల్లో పాల్గొనడం తనకెంతో గర్వంగా, అదృష్టంగా ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన వినాశకర, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఎన్నారైలు ప్రదర్శించిన సంఘీభావం, తెగువ నిజంగా మరువలేనివని కొనియాడారు. మాతృభూమి కోసం ప్రవాసాంధ్రులు చేసిన ఈ పోరాటం పార్టీకి ఎనలేని బలాన్ని ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోధైర్యం, నిరంతరాయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన అలుపెరగని పోరాటం వల్లే గత ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని అంతం చేయగలిగామని ఎంపీ అప్పలనాయుడు పేర్కొన్నారు. తెలుగు నేలపై ఉద్భవించిన పసుపు జెండా ఇవాళ ఖండాంతరాలు దాటి, ప్రపంచానికి చిట్టచివరన ఉన్న న్యూజిలాండ్ వంటి దేశంలో సగర్వంగా ఎగరవేయడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణించారు. ఎన్నారైలు కేవలం ఆర్థికంగానే కాకుండా, రాజకీయంగా కూడా రాష్ట్ర భవిష్యత్తును మార్చడంలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా అభినందించారు.

ప్రస్తుతం విజనరీ నాయకుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యువనేత మంత్రి నారా లోకేష్ సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఎంపీ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఖచ్చితంగా అమలు చేసి ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను చేరవేస్తుందని భరోసా ఇచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల పూర్తి సహకారంతో ఏర్పాటైన ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఎంతో బలమైన పునాదులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

న్యూజిలాండ్ దేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, ఎంపీ హెలెన్ వైట్, ప్రస్తుత ఎంపీ కార్లోస్ చియుంగ్, మాజీ మంత్రి మైఖేల్ వుడ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైన నాయకత్వాన్ని, విజన్‌ను ప్రశంసించడం ప్రతీ ఒక్క తెలుగువాడికి ఎంతో గర్వకారణమని ఎంపీ అప్పలనాయుడు పేర్కొన్నారు. విదేశీ ప్రతినిధులు సైతం చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడడం తనకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ ప్రతినిధులు, తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగువారి ఆరాధ్యదైవం స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) ఆశయాలు, స్ఫూర్తితో సమాజ సేవకు సరికొత్త వేదిక సిద్ధమైంది. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఏర్పాటైన 'ఎన్టీఆర్ ట్రస్ట్'ను విజయనగరం పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) కలిశెట్టి అప్పలనాయుడు అధికారికంగా ప్రారంభించారు. అధికారిక గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ ఛారిటీ హోదాతో ఈ స్వచ్ఛంద సంస్థ తన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించింది. సమాజంలోని అణగారిన వర్గాలకు, నిరుపేదలకు అండగా నిలవడమే ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రారంభోత్సవ కార్యక్రమంలో వక్తలు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు, ప్రతినిధులైన జితేంద్ర నిమ్మగడ్డ, వేణు సోమపల్లి, దిలీప్ మద్దూకూరి మాట్లాడుతూ.. సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే బలమైన సంకల్పంతోనే ఈ అడుగు ముందుకు వేశామని తెలిపారు. సర్ ఎన్టీఆర్ గారు దేశవ్యాప్తంగా ప్రదర్శించిన మానవతా దృక్పథం, ప్రజా సేవ మరియు ఆయన చూపిన మార్గమే తమకు నిరంతర స్ఫూర్తి అని కొనియాడారు. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు విద్య, వైద్యం మరియు ఇతర సామాజిక రంగాలలో తమ వంతుగా ఎంతో సేవ చేయగలమనే నమ్మకాన్ని వారు ఈ సందర్భంగా వ్యక్తపరిచారు.

నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వినూత్న సేవా కార్యక్రమాలతో ఈ ట్రస్ట్ ముందుకు సాగనుంది. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చేతుల మీదుగా ప్రారంభం కావడం శుభపరిణామమని, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా విసృతి స్థాయిలో సేవా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి పేదవాడికి సాయం అందడమే లక్ష్యంగా, పారదర్శకమైన సేవా విధానాలతో ఈ సంస్థ పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని ట్రస్ట్ నిర్వాహకులకు తమ అభినందనలు తెలియజేశారు.

Spotlight

Read More →