India railway : భారత రైల్వే చరిత్రలో 2019 సంవత్సరం ఓ మైలురాయి మొదలైన చెప్పుకోవాలి. అప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో మాత్రమే నడిచిన రైల్వేలు తొలిసారిగా ప్రైవేటు రంగంలో అడుగుపెట్టాయి. ఆ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్.
ఈ రైలు న్యూఢిల్లీ–లక్నో మార్గంలో పరుగులు పెడుతోంది. దీన్ని ప్రభుత్వ సంస్థ అయిన ఐఆర్సీటీసీ (IRCTC) నిర్వహిస్తోంది. తేజస్ ప్రారంభమయ్యిన 2019 అక్టోబర్ 4నుంచి ప్రయాణికుల స్పందన అంచనాలు మించిపోయింది. మొదటి నెలలోనే ఐఆర్సీటీసీకి సుమారు రూ.7.7 లక్షల ఆదాయం రావడం, ఈ ప్రాజెక్ట్‌పై ప్రజల నమ్మకం ఏ స్థాయిలో ఉందో చూపించింది.
తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు సౌకర్యాలు ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ స్థాయిలో ఉన్నాయి. ఆటోమేటిక్ డోర్లు, వైఫై, సీసీటీవీ కెమెరాలు, ఆన్‌బోర్డ్ ఎంటర్టైన్మెంట్, రీడింగ్ లైట్లు, స్నాక్ ట్రేలు, క్లీన్ టాయిలెట్లు వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
రైల్వే మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, ఈ రైలు కోచ్‌లు గంటకు 200 కి.మీ. వేగం చేరగలిగేలా రూపొందించారు. కానీ ప్రస్తుత రైలు ట్రాక్ పరిమితుల కారణంగా గంటకు 160 కి.మీ. వేగంతో నడుస్తోంది. ఈ రైలు కోచ్‌లు పంజాబ్‌లోని కపుర్తల రైల్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మించారు. భద్రత విషయంలోనూ కొత్త సాంకేతికతలను ఉపయోగించారు.
చార్జీల విషయానికి వస్తే – ఢిల్లీ–లక్నో మార్గంలో ఏసీ చైర్ కార్ టికెట్ రూ.1679, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.2457. ఇది శతాబ్ది, వందే భారత్ రైళ్ల కంటే కొంచెం ఎక్కువే అయినా సేవలు, సమయపాలన సౌకర్యం దృష్ట్యా ఆ ధరకు సరైన విలువ లభిస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు.
తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశంతో రైల్వే రంగంలో ప్రైవేట్ పాలుపంచు ప్రారంభమైంది. ప్రయాణికులకు మెరుగైన అనుభవం, ప్రభుత్వానికి ఆధునీకరణ దిశలో ముందడుగు – రెండింటినీ ఈ రైలు సాధించింది.
మొత్తంగా చెప్పాలంటే, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైల్వే చరిత్రలో ఒక నూతన దశను ప్రారంభించింది.వేగం, సౌకర్యం, ఆధునిక సేవలు ఇవన్నీ కలిపి భారత ప్రయాణికుడికి కొత్త స్థాయి ప్రయాణ అనుభూతిని అందిస్తోంది.