China-USA: మా అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు.... అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్! USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Iran-USA: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం... అదే కారణం! Middle East Conflict: ఇది చెడు వార్త.. ఇరాన్ మా షరతులకు అంగీకరించలేదు..జేడీ వెన్స్ కీలక ప్రకటన..! Donald Trump: చాగోస్ దీవుల అప్పగింతకు బ్రిటన్ బ్రేక్.. ట్రంప్ వ్యతిరేకతతో ఒప్పందం నిలిపివేత! Jag Vikram: ఉద్రిక్తతల వీడిన వేళ.. హార్ముజ్ జలసంధిలో రెపరెపలాడిన భారత జెండా! COP 33: భారత్ సంచలన నిర్ణయం... 2028 'కాప్ 33' సదస్సు హోస్టింగ్ నుంచి విరమణ! UAE Updates: యుద్ధ క్షేత్రంలో జయశంకర్... శాంతి దూతగా భారత్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Middle East Conflict: లెబనాన్‌తో శాంతి చర్చలకు నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని హెచ్చరిక! China-USA: మా అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు.... అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్! USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Iran-USA: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం... అదే కారణం! Middle East Conflict: ఇది చెడు వార్త.. ఇరాన్ మా షరతులకు అంగీకరించలేదు..జేడీ వెన్స్ కీలక ప్రకటన..! Donald Trump: చాగోస్ దీవుల అప్పగింతకు బ్రిటన్ బ్రేక్.. ట్రంప్ వ్యతిరేకతతో ఒప్పందం నిలిపివేత! Jag Vikram: ఉద్రిక్తతల వీడిన వేళ.. హార్ముజ్ జలసంధిలో రెపరెపలాడిన భారత జెండా! COP 33: భారత్ సంచలన నిర్ణయం... 2028 'కాప్ 33' సదస్సు హోస్టింగ్ నుంచి విరమణ! UAE Updates: యుద్ధ క్షేత్రంలో జయశంకర్... శాంతి దూతగా భారత్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Middle East Conflict: లెబనాన్‌తో శాంతి చర్చలకు నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని హెచ్చరిక!

Chandrababu: సచివాలయంలో NRI సభ్యులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ భేటీ! గల్ఫ్ కార్మికుల సమస్యలపై సానుకూల స్పందన..

Chandrababu intimate meeting NRI members: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలతో నేరుగా కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజల అభిప్రాయాలను స్వయంగా వినడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

Published : 2026-02-28 16:03:00
  • పరిస్థితి విషమం.. నిరంతర సమీక్ష: ఇజ్రాయెల్ అధికారులతో టచ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం..
     
  • ఇరాన్ ప్రతీకార దాడుల ముప్పు?: ఇజ్రాయెల్ లోని భారతీయులు బంకర్లకు దగ్గరగా ఉండాలని సూచన..

Chandrababu intimate meeting NRI members: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలతో నేరుగా కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజల అభిప్రాయాలను స్వయంగా వినడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27 శుక్రవారం అమరావతి సచివాలయంలో అమెరికా, ఒమన్ దేశాలకు చెందిన ఎన్నారైలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ సమన్వయం చేశారు.

అమెరికా మరియు ఒమన్ నుంచి వచ్చిన ఎన్నారైలను సీఎం ఆత్మీయంగా పలకరించారు. వారి కుటుంబాలు, వృత్తులు, వారు నివసిస్తున్న దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో అమెరికా నుంచి ఆళ్ల వెంకట్, కొమ్మినేని ప్రసాద్, కండెరి భాస్కర్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. అలాగే ఒమన్ నుంచి మహమ్మద్ ఇమామ్ పాల్గొన్నారు.

అమెరికా నుంచి వచ్చిన కండెరి భాస్కర్ తన కుమార్తె నవ్య అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అని తెలిపారు. ఆమె 12 అంతర్జాతీయ, 20 జాతీయ టోర్నమెంట్లలో విజయం సాధించిందని చెప్పారు. ఆమె క్రీడా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని వారు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు.

ఇక గల్ఫ్ దేశాల్లో తెలుగు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఒమన్ నుంచి వచ్చిన మహమ్మద్ ఇమామ్ వివరించారు. ఏజెంట్ల మోసాలు, ఎంబసీ వద్ద పరిష్కారం కాని సమస్యలు, కార్మికులు పడే ఇబ్బందులను తెలియజేశారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. సమస్యను సమగ్రంగా పరిశీలించి, మోసపూరిత చర్యలను అరికట్టేందుకు తగిన చట్టపరమైన, పరిపాలనా చర్యలు ఎలా తీసుకోవాలో, సమగ్రంగా స్టడీ చేసి దానికి అవసరమైన కార్యాచరణను తయారు చేయవలసిందిగా ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్‌ ను ఆదేశించారు. విదేశాలకు వెళ్లే కార్మికులకు రక్షణ కల్పించేందుకు బలమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని ఆయన సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక మరియు అతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ఆసక్తి చూపుతున్నారని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తే మరింత మంది ముందుకు వస్తారని చెప్పారు. విదేశాల్లో ఉన్న అవకాశాలను తెలుగు యువత వినియోగించుకునేలా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

వారి సూచనలకు స్పందించిన సీఎం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలచిన ఎన్నారైలు స్పష్టమైన ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారితో సంబంధాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావడాన్ని ప్రభుత్వం స్వాగతిస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం రావడం తమకు మరచిపోలేని అనుభవమని ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →