Malta TDP 44th Anniversary: మాల్టా తీరాన మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. సీఎం చంద్రబాబు విజన్‌పై ఎన్ఆర్ఐల ప్రశంసలు! Middle East War: రష్యా చమురు సామ్రాజ్యంపై ఉక్రెయిన్ డ్రోన్ల మెరుపు దాడి.. ఉస్త్ లుగా పోర్టు అతలాకుతలం! No Kings Protest: అమెరికాలో ప్రజా గర్జన.... ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా 50 రాష్ట్రాల్లో 'నో కింగ్స్' నిరసనలు! TFAS నూతన ప్రస్థానం... 2026 టర్మ్ కోసం కొత్త ట్రస్టీలు, ఆఫీసర్ల ప్రకటన! TAMA: తామా టోర్నమెంట్‌లో ప్రతిభ చాటిన తెలుగు క్రీడాకారులు! WATS: సీతారాముల నామస్మరణతో పులకించిన వాషింగ్టన్.. ఆధ్యాత్మిక శోభలో తెలుగు సమితి! NRI: విదేశీ గడ్డపై తెలుగు వెలుగులు.. వంశీ అంతర్జాతీయ అవార్డుల ప్రకటన! H1B Visa: అమెరికాలో భారతీయులకు పండగే.. హెచ్-1బీ వేతనాల్లో భారీ పెంపు! Trump: 1987లోనే ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ స్కెచ్? వైరల్ అవుతున్న పాత పత్రికా కథనం! US vs Iran: పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ రహస్య చర్చలు? వైట్ హౌస్ సంచలన ప్రకటన! Malta TDP 44th Anniversary: మాల్టా తీరాన మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. సీఎం చంద్రబాబు విజన్‌పై ఎన్ఆర్ఐల ప్రశంసలు! Middle East War: రష్యా చమురు సామ్రాజ్యంపై ఉక్రెయిన్ డ్రోన్ల మెరుపు దాడి.. ఉస్త్ లుగా పోర్టు అతలాకుతలం! No Kings Protest: అమెరికాలో ప్రజా గర్జన.... ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా 50 రాష్ట్రాల్లో 'నో కింగ్స్' నిరసనలు! TFAS నూతన ప్రస్థానం... 2026 టర్మ్ కోసం కొత్త ట్రస్టీలు, ఆఫీసర్ల ప్రకటన! TAMA: తామా టోర్నమెంట్‌లో ప్రతిభ చాటిన తెలుగు క్రీడాకారులు! WATS: సీతారాముల నామస్మరణతో పులకించిన వాషింగ్టన్.. ఆధ్యాత్మిక శోభలో తెలుగు సమితి! NRI: విదేశీ గడ్డపై తెలుగు వెలుగులు.. వంశీ అంతర్జాతీయ అవార్డుల ప్రకటన! H1B Visa: అమెరికాలో భారతీయులకు పండగే.. హెచ్-1బీ వేతనాల్లో భారీ పెంపు! Trump: 1987లోనే ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ స్కెచ్? వైరల్ అవుతున్న పాత పత్రికా కథనం! US vs Iran: పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ రహస్య చర్చలు? వైట్ హౌస్ సంచలన ప్రకటన!

Green card : గ్రీన్‌కార్డుకు రెడ్‌ సిగ్నల్‌.. కార్పొరేట్‌ రంగంపై పెనుప్రభావం! మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు..

అమెరికాలో ట్రంప్ సర్కారు వచ్చిన తర్వాత గ్రీన్కార్డులు, వీసాల జారీ, వలసపోవడం కష్టతరంగా మారాయి. అయితే.. వీటిల్లో వీసాలు, గ్రీన్కార్డుల జారీలో జాప్యం వల్ల ఇప్పుడు

Published : 2025-07-22 09:54:00

అమెరికాలో ట్రంప్ సర్కారు వచ్చిన తర్వాత గ్రీన్కార్డులు, వీసాల జారీ, వలసపోవడం కష్టతరంగా మారాయి. అయితే.. వీటిల్లో వీసాలు, గ్రీన్కార్డుల జారీలో జాప్యం వల్ల ఇప్పుడు ఆ దేశ కార్పొరేట్ రంగంపై దుష్ప్రభావం చూపడం మొదలుపెట్టింది.

వివిధ రంగాల్లోని కార్పొరేట్ లీడర్లు, సీనియర్ అధికారి ఉద్యోగ అనుమతులు ముగియడం.. వాటి పునరుద్ధరణ వెంటనే జరగకపోవడంతో వారు పదవుల నుంచి వైదొలగాల్సి వస్తోంది. ముఖ్యంగా శాశ్వత నివాసం కల్పించే గ్రీన్కార్డ్ల జారీలో జాప్యం వల్ల.. సక్రమమార్గంలో దేశంలోకి వచ్చి కొన్నేళ్లుగా వివిధ కంపెనీల్లో పని చేస్తున్నవారు కూడా వెళ్లిపోయేటట్లు చేస్తోంది.

అమెరికాలోనే అతిపెద్దదైన మెట్రోపాలిటన్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అథారిటీ సీఈవో కొల్లిన్ గ్రీనవుడ్ జులై 17న పదవి నుంచి వైదొలిగారు. ఆయనకు ఉద్యోగ అనుమతి కాలవ్యవధి ముగిసిపోవడం.. గ్రీన్కార్డ్ జారీలో జాప్యంతో ఆయన తన పదవిలో కొనసాగడం అసాధ్యంగా మారింది.

దీంతో ముందస్తు పదవీ విరమణను ఆయన ఎంచుకొన్నారు. ఆయన స్వస్థలం కెనడా. తమ సీఈవోకు గ్రీన్కార్డ్ త్వరలోనే వస్తుందని మార్టా చెప్పినా.. పదవిని వీడేందుకే గ్రీన్వుడ్ మొగ్గు చూపారు.

వాస్తవానికి గ్రీన్వుడ్ మార్టా సీఈవోగా 2022 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చిన తర్వాత సంస్థ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడింది. ఆయన ఉద్యోగ అనుమతికి సంబంధించిన పత్రాలు జూన్ 18నే ముగిసిపోయాయి.

అయినా కానీ, ఆయన గ్రీన్కార్డ్ వచ్చేవరకు కెనడా వీసాపై అమెరికాలో కొనసాగుతారని మార్టా పేర్కొంది. అమెరికా రవాణారంగంలో పలువురు ప్రముఖ అధికారులు రాజీనామాల పరంపరలో గ్రీన్ వుడి కూడా ఒకటి. వీరిలో చాలామంది కార్యనిర్వహణ సవాళ్లు, వలస గడువుల వంటి కారణాలతో ఉద్యోగాలను వదిలేశారు.

అమెరికాలో గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేసుకొన్న భారతీయులు.. ప్రాసెసింగ్లో తీవ్రమైన జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో వలసల పెండింగ్ దరఖాస్తులు 1.13 కోట్లకు చేరాయి. ఈ స్థాయిలో పెండింగ్లో ఉండటం ఓ రికార్డు. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు వచ్చి చేరనున్నాయి.

ఇటీవల అమెరికా వలస సేవా సంస్థ విడుదల చేసిన డేటాలో ఈ వివరాలున్నాయి. రెండో త్రైమాసికంలో ప్రాసెస్ చేసిన దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గింది. గతేడాది 3.3 మిలియన్లు చేయగా.. ఈసారి 2.7 మిలియన్లకే పరిమితమైంది. ఇక గ్రీన్కార్డ్ దరఖాస్తుదారులు వాడే ఫారమ్ ఐ-90 సగటు వేచి ఉన్న సమయం 0.8 నెలల నుంచి 8 నెలలకు చేరింది. ఫారమ్ ఐ-765ల్లో దాదాపు 2 మిలియన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.

Spotlight

Read More →