ICC: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆ పేరు..!. ఐసీసీ అధికారిక ప్రకటన! Jobs: ఫార్మసీ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్..! IAF గ్రూప్ ‘Y’లో భారీ నియామకాలు! Daggubati brothers: దగ్గుబాటి సోదరులపై కోర్టు ఫైర్.. సెలబ్రిటీలకు వేరే న్యాయమా! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Luxury Resorts: సెలబ్రిటీల ఫేవరెట్ డెస్టినేషన్! నీలి సముద్రం.. తెల్లటి ఇసుక.. ఈ 10 రిసార్టులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Hindu Astrology: బెల్లం కలిపిన నీటితో సూర్యారాధన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ముఖ్యంగా వారు చేస్తే ఇంకా తిరిగే ఉండదు!! Visa-Free: భారతీయులకు విదేశీ ప్రయాణంలో కొత్త అడ్డంకులు! ఆ రెండు దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీకి బ్రేక్! Best Printers 2026: ఇంట్లో ప్రింటింగ్ ఇక సులువు.. ఒక్క ప్రింటర్‌తో మూడు పనులు చేసే Wi-Fi మోడల్స్ – మరిన్ని ఫీచర్స్ తెలుసుకోండి..!! ICC: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆ పేరు..!. ఐసీసీ అధికారిక ప్రకటన! Jobs: ఫార్మసీ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్..! IAF గ్రూప్ ‘Y’లో భారీ నియామకాలు! Daggubati brothers: దగ్గుబాటి సోదరులపై కోర్టు ఫైర్.. సెలబ్రిటీలకు వేరే న్యాయమా! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Luxury Resorts: సెలబ్రిటీల ఫేవరెట్ డెస్టినేషన్! నీలి సముద్రం.. తెల్లటి ఇసుక.. ఈ 10 రిసార్టులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Hindu Astrology: బెల్లం కలిపిన నీటితో సూర్యారాధన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ముఖ్యంగా వారు చేస్తే ఇంకా తిరిగే ఉండదు!! Visa-Free: భారతీయులకు విదేశీ ప్రయాణంలో కొత్త అడ్డంకులు! ఆ రెండు దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీకి బ్రేక్! Best Printers 2026: ఇంట్లో ప్రింటింగ్ ఇక సులువు.. ఒక్క ప్రింటర్‌తో మూడు పనులు చేసే Wi-Fi మోడల్స్ – మరిన్ని ఫీచర్స్ తెలుసుకోండి..!!

Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!!

Singarenni Controversy: సింగరేణి సంస్థపై కట్టుకథలు, తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. సింగరేణి పరిరక్షణే లక్ష్యమని, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు...

2026-01-24 16:49:00
Railway: రైల్వేలో భారీ ఉద్యోగాలు! 22 వేల కొలువులు...10వ తరగతి అర్హతతో గోల్డెన్ ఛాన్స్..!

సింగరేణి సంస్థపై జరుగుతున్న ప్రచారాలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు ప్రాణంలాంటి సింగరేణి కోల్ మైన్స్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు కావాలని కట్టుకథలు అల్లుతున్నారని ఆయన ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క, రోజుకో కొత్త కథనంతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ కథనాల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో ప్రజలు గమనించాలని సూచించారు.

Best Printers 2026: ఇంట్లో ప్రింటింగ్ ఇక సులువు.. ఒక్క ప్రింటర్‌తో మూడు పనులు చేసే Wi-Fi మోడల్స్ – మరిన్ని ఫీచర్స్ తెలుసుకోండి..!!

సింగరేణి వంటి కీలక ప్రభుత్వ రంగ సంస్థపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇలాంటి కథనాలు సంస్థలో పనిచేస్తున్న వేలాది కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సింగరేణి ఎంతో కీలకమని, అలాంటి సంస్థ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు.

Visa-Free: భారతీయులకు విదేశీ ప్రయాణంలో కొత్త అడ్డంకులు! ఆ రెండు దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీకి బ్రేక్!

టెండర్ల విషయంలో కావాలని అపోహలు సృష్టిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. 2021లోనే సెంట్రల్ మైనింగ్ సంస్థ సైట్ విజిట్ తప్పనిసరి అని సూచించిందని గుర్తు చేశారు. టెండర్ డాక్యుమెంట్లు సిద్ధమైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదని, గతంలో రూపొందించిన నిబంధనల ప్రకారమే సింగరేణి టెండర్లు పిలిచిందన్నారు. వాస్తవాలు పక్కన పెట్టి, తనపై నిందలు మోపేలా కథనాలు వండుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hindu Astrology: బెల్లం కలిపిన నీటితో సూర్యారాధన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ముఖ్యంగా వారు చేస్తే ఇంకా తిరిగే ఉండదు!!

తాను రాజకీయాల్లోకి వ్యక్తిగత లాభాల కోసం రాలేదని, సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే ప్రజాసేవ చేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పాదయాత్ర సమయంలో కూడా సింగరేణి పరిరక్షణ కోసం పోరాడానని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన బొగ్గు వనరులపై ఏ గద్దనూ వాలనీయబోనని, సంస్థ ఆస్తులను కాపాడడమే తన బాధ్యత అని చెప్పారు.

సింగరేణికి సంబంధించిన టెండర్లపై అనుమానాలుంటే విచారణకు తాను సిద్ధమని భట్టి విక్రమార్క ప్రకటించారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ చేయడానికి ప్రభుత్వం వెనుకాడదన్నారు. రాజకీయ నాయకులు లేఖలు రాయాలనుకుంటే నేరుగా తనకే రాయాలని, అప్పుడు తానే విచారణకు ఆదేశిస్తానని వ్యాఖ్యానించారు. అనవసరంగా ఇతరులకు లేఖలు రాసి గందరగోళం సృష్టించవద్దని హితవు పలికారు.

మీడియా, సోషల్ మీడియా వేదికలపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. వాస్తవాలు ప్రజల ముందుకు రావాలంటే అవసరమైన డాక్యుమెంట్లు కూడా విడుదల చేస్తామని తెలిపారు. అడ్డగోలు ప్రచారం చేసే వారి అసలు ఉద్దేశాలు బయటపడాలని అన్నారు. సింగరేణి ప్రతిష్టను కాపాడటం మాత్రమే కాదు, నిజాలను ప్రజలకు తెలియజేయడం కూడా ప్రభుత్వ బాధ్యత అని భట్టి విక్రమార్క తెలిపారు.

Spotlight

Read More →