అమరావతి కల సాకారం: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగువారి జయహో!
చంద్రబాబు నాయకత్వమే శ్రీరామరక్ష.. మెల్బోర్న్లో ఎన్నారైల తీర్మానం….
లోకేష్ కృషికి సలాం: రాజధాని చట్టబద్ధతపై ఎన్నారైల ప్రత్యేక ధన్యవాదాలు….
NRITDP Melbourne: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత లభించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఎన్ఆర్టీ (APNRTS) చైర్మన్ రవి వేమూరు పిలుపు మేరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఎన్నారై టీడీపీ మెంబర్స్ భారీ ఎత్తున సమావేశమయ్యారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించడం పట్ల వారు తమ ఆనందాన్ని పంచుకుంటూ, ఏపీ అభివృద్ధిలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.
ఈ సందర్భంగా ఎన్నారైలు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి స్వప్నాన్ని సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం చూపిస్తున్న పట్టుదల అభినందనీయమని వారు కొనియాడారు. రాజధాని విషయంలో గత ఐదేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడటం పట్ల మెల్బోర్న్ తెలుగు కమ్యూనిటీ సంబరాల్లో మునిగిపోయింది.
ముఖ్యంగా యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి కృషిని ఎన్నారైలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేలా చేయడంలో లోకేష్ గారు పోషించిన పాత్ర అమోఘమని వారు ప్రశంసించారు. అమరావతి నిర్మాణానికి చట్టపరమైన రక్షణ కల్పించడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది పడిందని వారు ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దినదినాభివృద్ధి చెందుతుందని, రాబోయే పదేళ్ల కాలంలో రాష్ట్రం అగ్రపథాన నిలుస్తుందని ఎన్నారైలు ఆశాభావం వ్యక్తం చేశారు. "ఒకే రాజధాని - ఒకే నినాదం" అనే భావనతో అమరావతిని పర్మినెంట్ రాజధానిగా దక్కించుకోవడం ఆంధ్రులందరి విజయమని వారు పేర్కొన్నారు. మెల్బోర్న్ నగరంలో జరిగిన ఈ సమావేశం ఒక పండగ వాతావరణాన్ని తలపించింది.
ఈ కార్యక్రమంలో సుబ్బారావు లగడపాటి, గోపి నంబాల, సంతోష్ కొల్లిపర, వంశీ తూమాటి, ఏడుకొండలు, అరవింద్, రవీంద్ర, వేమూరి వంశీ, వెంకట్ వట్టిరాజు, నర్మదా జొన్నలగడ్డ, మహిదర్ మరియు జనసేన సభ్యురాలు మహాలక్ష్మి గారితో పాటు పలువురు టీడీపీ, జనసేన మెంబర్స్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు.