Gulf Updates: కల్తీ కల్లు వ్యసనం.. దుబాయ్‌లో వికటించిన వైనం డిచుపల్లి వాసి గంగాధర్ కోసం ఎన్నారై సెల్ ప్రత్యేక చొరవ! Marco Rubio: భారత్‌కు ముడి చమురు సరఫరాకు అమెరికా రెడీ: విదేశాంగ మంత్రి మార్కో రుబియో కీలక ప్రకటన! Differently Abled: మార్కాపురంలో దివ్యాంగులకు ఉచిత త్రీ వీలర్ బైక్‌ల పంపిణీ! Pawan Kalyan: పుష్కర్ ఘాట్ టు కోటిలింగాల ఘాట్.. జలవిహారంలో పవన్: ఏర్పాట్లపై అధికారులతో కీలక సమీక్ష! Allu Arjun: థాంక్యూ వెంకటేష్ అయ్యర్.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఉదారతపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్! Australia: ఆస్ట్రేలియాలో ఘనంగా “మహానాడు కనెక్ట్ 2026” కార్యక్రమం! Gottipati Ravi: అద్దంకిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్! Telugu Badi: నెబ్రాస్కాలో ఘనంగా తెలుగు బడి వార్షికోత్సవం, గ్రాడ్యుయేషన్ వేడుకలు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. డేట్ లీక్ చేసిన స్కూట్ ఎయిర్‌లైన్స్! Joseph Vijay: సీఎం విజయ్‌కు తొలి పరీక్ష.. కోయంబత్తూరులో చిన్నారి కిడ్నాప్, దారుణ హత్య! Gulf Updates: కల్తీ కల్లు వ్యసనం.. దుబాయ్‌లో వికటించిన వైనం డిచుపల్లి వాసి గంగాధర్ కోసం ఎన్నారై సెల్ ప్రత్యేక చొరవ! Marco Rubio: భారత్‌కు ముడి చమురు సరఫరాకు అమెరికా రెడీ: విదేశాంగ మంత్రి మార్కో రుబియో కీలక ప్రకటన! Differently Abled: మార్కాపురంలో దివ్యాంగులకు ఉచిత త్రీ వీలర్ బైక్‌ల పంపిణీ! Pawan Kalyan: పుష్కర్ ఘాట్ టు కోటిలింగాల ఘాట్.. జలవిహారంలో పవన్: ఏర్పాట్లపై అధికారులతో కీలక సమీక్ష! Allu Arjun: థాంక్యూ వెంకటేష్ అయ్యర్.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఉదారతపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్! Australia: ఆస్ట్రేలియాలో ఘనంగా “మహానాడు కనెక్ట్ 2026” కార్యక్రమం! Gottipati Ravi: అద్దంకిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్! Telugu Badi: నెబ్రాస్కాలో ఘనంగా తెలుగు బడి వార్షికోత్సవం, గ్రాడ్యుయేషన్ వేడుకలు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. డేట్ లీక్ చేసిన స్కూట్ ఎయిర్‌లైన్స్! Joseph Vijay: సీఎం విజయ్‌కు తొలి పరీక్ష.. కోయంబత్తూరులో చిన్నారి కిడ్నాప్, దారుణ హత్య!

NATS: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం!

NATS: అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజానికి సేవలందిస్తూ ముందంజలో ఉన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది.

Published : 2026-05-23 14:51:00

మహిళలు, వృద్ధుల కోసం ఉచిత వైద్య సేవలు అందిస్తున్న నాట్స్..

ప్రముఖ వైద్యులతో నాట్స్ ఉచిత ఆరోగ్య శిబిరం..

అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజానికి సేవలందిస్తూ ముందంజలో ఉన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. “భాషే రమ్యం… సేవే గమ్యం” అనే నినాదంతో నాట్స్, న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనుంది. మహిళలు, పురుషులు, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేస్తున్న ఈ మెడికల్ క్యాంప్ మే 23, 2026 శనివారం నాడు ఎడిసన్ నగరంలో జరగనుంది.

ప్రవాస తెలుగు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం స్థానికంగా విశేష స్పందన పొందుతోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ వైద్య శిబిరం SDP SSVT NJ, 1665 ఓక్ ట్రీ రోడ్, సూట్ #370, ఎడిసన్, న్యూ జర్సీ లో నిర్వహించనున్నారు.

ఈ శిబిరంలో వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు పాల్గొని ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించనున్నారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ జనార్ధన్ బొల్లు, ఫ్యామిలీ మెడిసిన్ నిపుణులు డాక్టర్ స్మిత, అలాగే FNP-BC నిపుణురాలు బీనా లోపెజ్ సేవలు అందించనున్నారు.

ప్రవాస భారతీయులు ముఖ్యంగా ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఆరోగ్య అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రారంభ దశలోనే సమస్యలను గుర్తించి చికిత్స పొందేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.

ఈ హెల్త్ క్యాంప్‌ను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి పర్యవేక్షణలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, న్యూజెర్సీ చాప్టర్ టీమ్ మరియు అడ్వైజరీ కమిటీ సభ్యులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమం విజయవంతం కోసం వాలంటీర్లు కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.

వైద్య శిబిరానికి సంబంధించిన వివరాలు లేదా రిజిస్ట్రేషన్ కోసం మురళీకృష్ణ మేడిచర్ల (973-670-0578), బిందు యలమంచిలి (908-240-3167), కిరణ్ మందాడి (732-491-1776), శ్రీనివాస్ మెంతా (908-230-5390)లను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా అత్యవసర సమాచారం కోసం నాట్స్ హెల్ప్‌లైన్ నంబర్లు +1-888-4-TELUGU లేదా +1-888-483-5848 అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

Spotlight

Read More →