Gongura Pachadi Recipe: గోంగూర పచ్చడి ఇలా చేశారంటే ముద్ద అన్నం కూడా వదిలిపెట్టరు.. వేడి అన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్ ..!! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. Tollywood News: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫిక్స్? రాజస్థాన్ ప్యాలెస్‌లో వేడుక.. లీకైన వీడియోతో ఫ్యాన్స్‌కు పండగే! Internships 2026: విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ నెలకు రూ. 15,000 స్టైపెండ్.. దరఖాస్తుకు మార్చి 2 చివరి తేదీ! Samsung Galaxy S26 Ultra ఫీచర్లు లీక్.. 200MP కెమెరాతో ఐఫోన్‌కు గట్టి పోటీ! సన్నగా.. స్టైలిష్‌గా - గేమర్లకు ఇక పండగే! బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! Gac Fruit Health Benefits: గ్యాక్ ఫ్రూట్ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.. అరుదైన గ్యాక్ ఫ్రూట్ విశేషాలు మీకోసం.!! గోదావరి జిల్లాలకు ఊరట..! ఆ ప్రాంతంలో 3 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే ఛాన్స్..! Gongura Pachadi Recipe: గోంగూర పచ్చడి ఇలా చేశారంటే ముద్ద అన్నం కూడా వదిలిపెట్టరు.. వేడి అన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్ ..!! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. Tollywood News: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫిక్స్? రాజస్థాన్ ప్యాలెస్‌లో వేడుక.. లీకైన వీడియోతో ఫ్యాన్స్‌కు పండగే! Internships 2026: విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ నెలకు రూ. 15,000 స్టైపెండ్.. దరఖాస్తుకు మార్చి 2 చివరి తేదీ! Samsung Galaxy S26 Ultra ఫీచర్లు లీక్.. 200MP కెమెరాతో ఐఫోన్‌కు గట్టి పోటీ! సన్నగా.. స్టైలిష్‌గా - గేమర్లకు ఇక పండగే! బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! Gac Fruit Health Benefits: గ్యాక్ ఫ్రూట్ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.. అరుదైన గ్యాక్ ఫ్రూట్ విశేషాలు మీకోసం.!! గోదావరి జిల్లాలకు ఊరట..! ఆ ప్రాంతంలో 3 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే ఛాన్స్..!

Gac Fruit Health Benefits: గ్యాక్ ఫ్రూట్ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.. అరుదైన గ్యాక్ ఫ్రూట్ విశేషాలు మీకోసం.!!

అద్భుత పోషకాల గని గ్యాక్ ఫ్రూట్ పండులో క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు, కంటి చూపును మెరుగుపరిచే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. దీనిని కూరగా ఎలా వండుకోవాలి? జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి? మరియు దీని వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోండి

Published : 2026-02-02 13:50:00

నేటి కాలంలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో మన తెలుగు రాష్ట్రాల్లోకి ఒక అద్భుతమైన విదేశీ ఫలం అడుగుపెట్టింది. అదే ‘గ్యాక్ ఫ్రూట్’ (Gac Fruit).సాధారణంగా వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాల్లో కనిపించే ఈ పండును, మన వాతావరణంలో సాగు చేస్తూ విజయం సాధించడం గమనార్హం.

నాలుగు రంగుల వింత.. రుచిలో అద్భుతం

గ్యాక్ ఫ్రూట్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది పెరిగే కొద్దీ నాలుగు దశల్లో రంగులు మారడం దీని ప్రత్యేకత. మొదట గదుల వంటి ఆకృతితో ఆకుపచ్చ  రంగులో ఉండి, తర్వాత పసుపు , ఆపై ఆరెంజ్  రంగులోకి మారుతుంది. పండు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ దశలోనే దీనిని జ్యూస్ కోసం ఉపయోగిస్తారు.

కూరగా మరియు జ్యూస్‌గా బహుళ ఉపయోగాలు

ఈ పండును కూరగా మరియు జ్యూస్‌గా రెండు రకాలుగా వాడుకోవచ్చు. పండు లేత పసుపు రంగులో  ఉన్నప్పుడు దీనిని కట్ చేసి కూర వండుకోవచ్చు. ఈ కూర రుచి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నాన్-వెజ్ ప్రియులు కూడా దీనిని తింటే ఫిదా అయిపోతారు. మాంసాహారం తిన్న దానికంటే ఎక్కువ సంతృప్తిని, ప్రోటీన్లను ఈ కూర అందిస్తుంది.

ఇక జ్యూస్ విషయానికి వస్తే, పండు పూర్తిగా ఎర్రగా మారినప్పుడు మధ్యలోకి కట్ చేయాలి. లోపల ఉండే ఎర్రటి విత్తనాలపై ఉన్న పొరను, ఎల్లో కలర్ ఆరను (గుజ్జును) వేరు చేసి పెట్టుకోవాలి. ఒక కేజీ బరువున్న పండుతో దాదాపు పది మందికి సరిపడా జ్యూస్ తయారు చేయవచ్చు. ఇందులో మీ టేస్ట్‌ను బట్టి పంచదార లేదా బెల్లం, అలాగే కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే అమృతంలా ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు 

గ్యాక్ ఫ్రూట్‌ను స్వర్గపు ఫలం అని పిలుస్తారు. దీనిలో లైకోపీన్ మరియు బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

క్యాన్సర్ నివారణ: ఇందులో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాలతో పోరాడటంలో సహాయపడతాయి.

కంటి చూపు: కంటి చూపు మెరుగుపడటానికి ఇది రామబాణంలా పనిచేస్తుంది.

జుట్టు మరియు చర్మం: జుట్టు ఎదుగుదలకు, చర్మ సౌందర్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

 అల్పాహారానికి ప్రత్యామ్నాయం: ఉదయం పూట భారీగా ఇడ్లీలు, దోశలు తినే బదులు, ఒక గ్లాసు గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ తాగితే రోజంతా కావాల్సిన శక్తి లభిస్తుంది.

Spotlight

Read More →