Ishaq Dar: పరువు పాయే.. కాలు జారిన పాకిస్తాన్ ఉప ప్రధాని.. వీడియో వైరల్.. భుజానికి గాయం! Healthy Drink: వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఈ డ్రింక్ తాగాల్సిందే! Prakash Raj: ప్రకాశ్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం.. కుమారుడి మరణం తర్వాత మరో తీరని లోటు! Malta TDP 44th Anniversary: మాల్టా తీరాన మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. సీఎం చంద్రబాబు విజన్‌పై ఎన్ఆర్ఐల ప్రశంసలు! High Court: మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్...హైకోర్టు కీలక తీర్పు! Dhurandhar: 'ధురంధర్' క్రేజ్.. సినిమాలో చిన్న పాత్రను కూడా వదలని నెటిజన్లు.. 30 ఏళ్ల నాటి గుట్టు రట్టు! AP TIDCO Houses: లక్షలాది పేదల సొంతింటి కల సాకారం.. ఏపీలో అట్టహాసంగా 2.5 లక్షల గృహప్రవేశాల పండుగ! New RBI Rules: సామాన్యులకు భారీ ఊరట! ఏప్రిల్ 1 నుండి అమల్లోకి కొత్త ఆర్‌బీఐ రూల్స్! Earth Sun Distance: హనుమాన్ చాలీసా లో ఒక్క వాక్యంలోనే సూర్యుడి దూరం ఎలా తెలిసింది? మన పురాణాలు ఆధునిక సైన్స్‌కు సవాల్! TDP 44th Anniversary: మస్కట్ వేదికగా పసుపు పండుగ.. ప్రవాస గడ్డపై రెపరెపలాడిన టీడీపీ జెండా! Ishaq Dar: పరువు పాయే.. కాలు జారిన పాకిస్తాన్ ఉప ప్రధాని.. వీడియో వైరల్.. భుజానికి గాయం! Healthy Drink: వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఈ డ్రింక్ తాగాల్సిందే! Prakash Raj: ప్రకాశ్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం.. కుమారుడి మరణం తర్వాత మరో తీరని లోటు! Malta TDP 44th Anniversary: మాల్టా తీరాన మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. సీఎం చంద్రబాబు విజన్‌పై ఎన్ఆర్ఐల ప్రశంసలు! High Court: మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్...హైకోర్టు కీలక తీర్పు! Dhurandhar: 'ధురంధర్' క్రేజ్.. సినిమాలో చిన్న పాత్రను కూడా వదలని నెటిజన్లు.. 30 ఏళ్ల నాటి గుట్టు రట్టు! AP TIDCO Houses: లక్షలాది పేదల సొంతింటి కల సాకారం.. ఏపీలో అట్టహాసంగా 2.5 లక్షల గృహప్రవేశాల పండుగ! New RBI Rules: సామాన్యులకు భారీ ఊరట! ఏప్రిల్ 1 నుండి అమల్లోకి కొత్త ఆర్‌బీఐ రూల్స్! Earth Sun Distance: హనుమాన్ చాలీసా లో ఒక్క వాక్యంలోనే సూర్యుడి దూరం ఎలా తెలిసింది? మన పురాణాలు ఆధునిక సైన్స్‌కు సవాల్! TDP 44th Anniversary: మస్కట్ వేదికగా పసుపు పండుగ.. ప్రవాస గడ్డపై రెపరెపలాడిన టీడీపీ జెండా!

AP TIDCO Houses: లక్షలాది పేదల సొంతింటి కల సాకారం.. ఏపీలో అట్టహాసంగా 2.5 లక్షల గృహప్రవేశాల పండుగ!

AP TIDCO Houses: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో నేడు 2.5 లక్షల టిడ్కో గృహప్రవేశాల మహోత్సవం. గత ఐదేళ్ల అడ్డంకులను అధిగమించి పేదవాడి సొంతింటి కలని నిజం చేసిన కూటమి ప్రభుత్వం.

Published : 2026-03-30 11:35:00

AP TIDCO Houses: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈరోజు ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. వేలాది పేద కుటుంబాల దశాబ్దాల కల నిజమవుతున్న వేళ, రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. గత ఐదేళ్లుగా అంధకారంలో ఉన్న టిడ్కో ఇళ్లకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో నేడు తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా సుమారు 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.

గత ప్రభుత్వం అనుసరించిన మొండి వైఖరి వల్ల రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో గృహ నిర్మాణాలు పూర్తిగా కుంటుపడ్డాయి. కేవలం రాజకీయ కక్షతో, ముందుటి ప్రభుత్వ ముద్ర ఉందనే నెపంతో అప్పటి పాలకులు ఇళ్లను పట్టించుకోకుండా వదిలేశారు. దీనివల్ల వేల కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా కావడమే కాకుండా, అప్పులు చేసి డబ్బులు కట్టిన పేద ప్రజలు నట్టేట మునిగారు. అసంపూర్తిగా వదిలేసిన ఆ భవనాలు పిచ్చిమొక్కలతో, శిథిలావస్థకు చేరుకుని పాములకు నిలయాలుగా మారడం మనం చూశాం. పేదవాడి సొంతింటి కలపై గత పాలకులు నీళ్లు చల్లారు.

             ఇది పేదలకు నాడు జగన్ రెడ్డి ఇచ్చిన సెంటు ఇళ్లు

కానీ, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగిపోయిన బిల్లులను విడుదల చేసి, కాంట్రాక్టర్లను సమన్వయం చేస్తూ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయించారు. కేవలం ఇళ్లే కాకుండా విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ  రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఆ కాలనీలకు కొత్త రూపు తీసుకువచ్చారు. పాలకుడు తలచుకుంటే అసాధ్యం సుసాధ్యం అని ఈ ప్రభుత్వం నిరూపించింది.

ఈరోజు జరుగుతున్న గృహప్రవేశాల మహోత్సవంలో కేవలం టిడ్కో ఇళ్లే కాకుండా, ఇతర గృహ నిర్మాణ పథకాల కింద నిర్మించిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలంతో పాటు, బలహీన వర్గాలకు అదనపు ఆర్థిక సాయం అందించడం ద్వారా పేదవాడికి ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ  మైనారిటీ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రస్థానం అభినందనీయం. సొంత ఇల్లు అనేది ఒక ఆత్మగౌరవ ప్రతీక అని భావించే ప్రతి పేదవాడికి ఈరోజు నిజమైన పండుగ రోజు.

      ఇవి నేడు చంద్రబాబు గారు పేదలకు ఇస్తున్న  టిడ్కో ఇళ్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ప్రేమగా 'మేస్త్రీ' అని ఎందుకు పిలుచుకుంటున్నారో ఈ అద్భుతమైన నిర్మాణాలే సాక్ష్యం. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాజకీయాల కంటే ప్రజల అవసరాలే ముఖ్యమని భావించే ఇలాంటి పరిపాలన వల్లనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా లక్షలాది కుటుంబాల కళ్లలో ఆనందం నింపిన కూటమి ప్రభుత్వం, సుపరిపాలనకు కొత్త నిర్వచనం చెప్పింది.

Spotlight

Read More →