TDP 44th Anniversary: మస్కట్ వేదికగా పసుపు పండుగ.. ప్రవాస గడ్డపై రెపరెపలాడిన టీడీపీ జెండా! Indian Vessels: వంటగ్యాస్ కొరతకు చెక్.. గల్ఫ్ ప్రాంతాన్ని సురక్షితంగా దాటిన రెండు భారత నౌకలు! Iran War: "రహస్య స్థావరాలపై డ్రోన్ల వర్షం": దుబాయ్‌లో గంటల తరబడి అంబులెన్సుల సైరన్లు.! Iran War: అమెరికాతో చర్చలకు సిద్ధం.. కానీ ఆ 5 షరతులు తీరాల్సిందే.! సంచలన నిర్ణయం - ఇరాన్ గట్టి పట్టు.! Iran War: ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ.. అమెరికా వశమైన ఖర్గ్ ద్వీపం! పశ్చిమాసియాలో సంచలనం.! Israeli War: హై టెన్షన్.. పాకిస్తాన్ పై ఇజ్రాయిల్ దాడి.. మా జోలికొస్తే వదిలిపెట్టం! పాకిస్తాన్ షిప్పులను బ్లాక్.. Iran War: అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఉద్రిక్తత.. అమెరికా అధికారి ఆరోపణలతో కలకలం.! మరో 'అంతులేని యుద్ధం'.. TDP 44th Anniversary: కువైట్‌లో పసుపు సైన్యం రక్తదానంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రశంసల జల్లు! 90 దేశాల్లో టీడీపీ వేడుకలు! Middle East Crisis 2026: గల్ఫ్ దేశాల ఆహార భద్రతకు ముప్పు: మధ్యప్రాచ్య సంక్షోభంతో పెరగనున్న బాస్మతి బియ్యం ధరలు! TDP 44th Anniversary: కువైట్‌లో హోరెత్తిన టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు.. భారీ రక్తదాన శిబిరంతో మానవత్వం చాటిన ఎన్నారై తెలుగుదేశం జనసేన సైన్యం! TDP 44th Anniversary: మస్కట్ వేదికగా పసుపు పండుగ.. ప్రవాస గడ్డపై రెపరెపలాడిన టీడీపీ జెండా! Indian Vessels: వంటగ్యాస్ కొరతకు చెక్.. గల్ఫ్ ప్రాంతాన్ని సురక్షితంగా దాటిన రెండు భారత నౌకలు! Iran War: "రహస్య స్థావరాలపై డ్రోన్ల వర్షం": దుబాయ్‌లో గంటల తరబడి అంబులెన్సుల సైరన్లు.! Iran War: అమెరికాతో చర్చలకు సిద్ధం.. కానీ ఆ 5 షరతులు తీరాల్సిందే.! సంచలన నిర్ణయం - ఇరాన్ గట్టి పట్టు.! Iran War: ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ.. అమెరికా వశమైన ఖర్గ్ ద్వీపం! పశ్చిమాసియాలో సంచలనం.! Israeli War: హై టెన్షన్.. పాకిస్తాన్ పై ఇజ్రాయిల్ దాడి.. మా జోలికొస్తే వదిలిపెట్టం! పాకిస్తాన్ షిప్పులను బ్లాక్.. Iran War: అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఉద్రిక్తత.. అమెరికా అధికారి ఆరోపణలతో కలకలం.! మరో 'అంతులేని యుద్ధం'.. TDP 44th Anniversary: కువైట్‌లో పసుపు సైన్యం రక్తదానంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రశంసల జల్లు! 90 దేశాల్లో టీడీపీ వేడుకలు! Middle East Crisis 2026: గల్ఫ్ దేశాల ఆహార భద్రతకు ముప్పు: మధ్యప్రాచ్య సంక్షోభంతో పెరగనున్న బాస్మతి బియ్యం ధరలు! TDP 44th Anniversary: కువైట్‌లో హోరెత్తిన టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు.. భారీ రక్తదాన శిబిరంతో మానవత్వం చాటిన ఎన్నారై తెలుగుదేశం జనసేన సైన్యం!

TDP 44th Anniversary: మస్కట్ వేదికగా పసుపు పండుగ.. ప్రవాస గడ్డపై రెపరెపలాడిన టీడీపీ జెండా!

TDP 44th Anniversary: ఒమన్‌ రాజధాని మస్కట్‌లో ఎన్ఆర్ఐ-టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యతను వివరిస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్‌ల నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ప్రవాసాంధ్రులు అభినందనలు తెలిపారు.

Published : 2026-03-30 10:41:00

TDP 44th Anniversary: మస్కట్‌లో ఘనంగా టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం ఒమన్ రాజధాని మస్కట్‌లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎన్ఆర్ఐ-టిడిపి (ఒమన్) విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. పసుపు రంగు తోరణాలు, పార్టీ జెండాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. తెలుగు జాతి గర్వించదగ్గ నేత నందమూరి తారకరామారావు ఆశయాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్యకర్తల పక్షాన ఉంటుందని, క్రమశిక్షణ కలిగిన కేడర్‌కు ఇచ్చే ప్రాధాన్యత మరే పార్టీలో ఉండదని ఈ సందర్భంగా  కొనియాడారు. సామాన్య కార్యకర్త కూడా ఉన్నత పదవులకు చేరుకునే అవకాశం కేవలం టిడిపిలోనే సాధ్యమని వారు అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వారిని గుర్తించి గౌరవించడం టిడిపి సంప్రదాయమని ప్రవాస నేతలు ఈ వేదికపై గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతను, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపనను సభ్యులు ప్రశంసించారు. ఐటీ రంగంలో ఏపీని ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత ఆయనదేనని కొనియాడారు. అదేవిధంగా, యువ నాయకుడు నారా లోకేష్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్న తీరుపై హర్షం వ్యక్తం చేశారు. వీరిద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ పునర్వైభవం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.

ఈ వేడుకల్లో భాగంగా ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చర్చించారు. తెలుగు రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారి సంక్షేమం కోసం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటామని ఎన్ఆర్ఐ-టిడిపి నేతలు ప్రతిజ్ఞ చేశారు.

 మస్కట్ నగరంలో జరిగిన ఈ 44వ ఆవిర్భావ వేడుకలు ఒమన్‌లోని తెలుగు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ, రాష్ట్ర పురోభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని ఎన్ఆర్ఐలు స్పష్టం చేశారు. ఐక్యమత్యంతో ముందుకు సాగి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునివ్వడంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.

Spotlight

Read More →