Header Banner

ఉగ్రవాదంపై భారత్‌కు మా సంపూర్ణ మద్దతు.! తేల్చిచెప్పిన అమెరికా - తమకు అత్యంత కీలకమైన!

  Tue May 06, 2025 13:28        U S A

ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ దేశం అన్ని విధాలా అండగా నిలుస్తుందని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ స్పష్టం చేశారు. భారత్ తమకు అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన అభివర్ణించారు. సోమవారం క్యాపిటల్ హిల్‌లో జరిగిన కాంగ్రెషనల్ బ్రీఫింగ్‌లో జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీమాంతర ఉగ్రవాదంతో దశాబ్దాలుగా సతమతమవుతున్న భారత్‌కు ఏం సందేశం ఇస్తారన్న ప్రశ్నకు మైక్ జాన్సన్ స్పందిస్తూ.. "భారత్‌లో జరుగుతున్న పరిణామాలపై మాకు పూర్తి సానుభూతి ఉంది. మిత్రదేశాలకు అండగా నిలవాలని మేము కోరుకుంటున్నాం. భారత్ మాకు చాలా ముఖ్యమైన భాగస్వామి.

 

ఇది కూడా చదవండి: షారుక్ ఖాన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్! ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్..

 

ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు సఫలీకృతం అవుతాయని ఆశిస్తున్నాను" అని తెలిపారు. "ఉగ్రవాదంపై పోరులో భారత్ కు అమెరికా చేయగలిగినదంతా చేస్తుంది" అని ఆయన అన్నారు. పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగినప్పుడు (ఏప్రిల్ 22) కూడా అమెరికా నేతలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో సహకారం అందిస్తామని, దాడికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు పూర్తి మద్దతు ఇస్తామని వారు హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలు తగ్గించుకొని, శాంతిని కాపాడేందుకు పాకిస్థాన్‌తో కలిసి పనిచేయాలని కూడా రూబియో సూచించినట్లు అప్పటి స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి తెలిపారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #Indian #Gold #AmericaWomen #Fakejewellery #Rajasthanica