Railway Line: ఆ రెండు జిల్లాల దశ తిరిగినట్లే! కొత్తగా మరో రైల్వే లైను! రూ.1,331 కోట్లతో... రూట్ ఫిక్స్!

బ్యాంక్ ఉద్యోగాలు కలలుకంటున్న అభ్యర్థులకు శుభవార్త. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా వెల్త్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 250 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.93 వేల వరకు జీతం లభించనుంది. అయితే అప్లికేషన్లకు గడువు తేది ఆగస్టు 28, 2025 వరకు మాత్రమే. అంటే, అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నాయి.

Ujjwala Scheme: ఉచితంగా LPG కనెక్షన్! రూ.550కే గ్యాస్ సిలిండర్! అర్హతలు, దరఖాస్తు విధానం!

ఈ నియామక ప్రక్రియ ద్వారా యూనియన్ బ్యాంక్ స్పెషలైజ్డ్ వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగానికి సిబ్బందిని ఎంపిక చేయనుంది. అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి. ఎంపిక విధానం ఆన్‌లైన్ ఎగ్జామ్, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా జరగనుంది. ఆన్‌లైన్ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్‌తో పాటు ప్రొఫెషనల్ నాలెడ్జ్‌ను పరీక్షించనున్నారు. మొత్తం పరీక్ష వ్యవధి 150 నిమిషాలు, మార్కులు 225.

Weather Report: వాతావరణ శాఖ హెచ్చరిక! ఉత్తరాంధ్రలో భారీ వర్ష సూచన... గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు!

అభ్యర్థులు కనీసం రెండు సంవత్సరాల ఫుల్‌టైమ్ ఎంబీఏ, పీజీడీఎమ్ లేదా సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలి. అదనంగా, బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు లేదా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం. వయస్సు 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం ఖాళీలను కేటాయించారు – ఎస్సీకి 37, ఎస్టీకి 18, ఒబిసి కి 67, ఈడబ్ల్యూఎస్‌కి 25, జనరల్ అభ్యర్థులకు 103 పోస్టులు.

Promotions: ఏపీలో వారందరికీ ప్రమోషన్లు! ఎన్నో ఏళ్ల కల... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

ఫీజు వివరాల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.177, ఇతర కేటగిరీల అభ్యర్థులకు రూ.1180గా నిర్ణయించారు. ఎంపికైనవారు కనీసం మూడు సంవత్సరాలు యూనియన్ బ్యాంక్‌తో బాండ్‌పై పనిచేయాలి. మధ్యలో రాజీనామా చేస్తే రూ.2.5 లక్షలతో పాటు వర్తించే పన్నులు చెల్లించాలి. అయితే, స్పెషలిస్ట్ ఆఫీసర్లకు భవిష్యత్తులో ప్రమోషన్ల అవకాశాలు కూడా ఉంటాయని బ్యాంక్ వెల్లడించింది.

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం! వాహన రాకపోకలకు అంతరాయం!

దరఖాస్తు చేయాలనుకునే వారు యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ [www.unionbankofindia.co.in](http://www.unionbankofindia.co.in) లోని కెరీర్స్ సెక్షన్‌లో అప్లై చేయాలి. లాగిన్ చేసి, నోటిఫికేషన్ పూర్తిగా చదివి, "Click here for Apply Online" ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫారం పూర్తి చేసి ఫీజు చెల్లించిన తర్వాత ప్రింట్ తీసుకోవడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ అవకాశాన్ని కోల్పోకుండా అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

విఘ్నేశ్వరుని ఆరాధనతో పాటు.. వ్యాపారులకు వరం అయిన పండుగ! వినాయక చవితి శుభాకాంక్షలతో..
Vishakapatnam: విశాఖ తీరంలో లాంఛనంగా ఆవిష్కృతమైన రెండు స్టెల్త్ యుద్ధనౌకలు! దేశ చరిత్రలో కొత్త అధ్యాయం!
Free Current: ఏపీలో వారికి భారీ శుభవార్త! కొత్త 5G ఫోన్లు... ఫ్రీ కరెంట్!
Emergency landing: అమెరికా నుండి ఇండియా ప్రయాణం మధ్యలోనే మరణించిన తెలుగు మహిళ! ఇస్తాంబుల్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్! నెల పాటు నరకయాతన!
Good News: గుడ్ న్యూస్! వినాయక చవితి పండుగ కానుక.. అకౌంట్లోకి డబ్బులు! డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు!