Header Banner

ఆ ప్రాంతం లో మరో రెండు రైల్వే లైన్లుకు శ్రీకారం! కేంద్రంతో కీలక చర్చలు!

  Thu May 01, 2025 14:14        Politics

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో రెండు రైల్వే లైన్‌లకు సంబంధించి ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.. ఈ మేరకు ఏపీ మంత్రి కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో కృష్ణపట్నం, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులకు సమీప స్టేషన్లతో రైల్వే అనుసంధానం చేయాలని ఏపీ పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి రిక్వెస్ట్ చేశారు. కృష్ణపట్నం, ఓర్వకల్లు పార్క్‌లను మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులుగా తీర్చిదిద్దేందకు ఉపయోగంగా ఉంటుందన్నారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి భరత్‌ ఈ కొత్త రైల్వే లైన్ల విస్తరణ ప్రతిపాదనలపై చర్చించారు. హైదరాబాద్‌-బెంగళూరు (హెచ్‌బీఐసీ) పారిశ్రామిక కారిడార్‌ పరిధిలోని ఓర్వకల్లు, చెన్నై-బెంగళూరు (సీబీఐసీ) పరిధిలోని కృష్ణపట్నం నోడ్‌లకు రైల్వే సౌకర్యాల వల్ల ఎన్నో లాభాలున్నాయి. దూపాడు రైల్వేస్టేషన్‌ నుంచి బేతంచర్ల వరకు కొత్త లైన్‌ వేసి ఓర్వకల్లు నోడ్‌ వరకు రైల్వే సైడింగ్‌ ఏర్పాటు చేయాలి. కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌ వరకు రైల్వే సైడింగ్‌ కోసం 12 కి.మీ.లు అభివృద్ధి చేయాలి' ఏపీ మంత్రి భరత్ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. రాష్ట్రంలో కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోంది.

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్ కింద మొదటి దశలో రూ.3,035.63 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా రూ.1,092 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ మేరకు నిక్‌డిక్ట్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టుల కోసం మాస్టర్ ప్లాన్‌లు, ఫీజబిలిటీ రిపోర్టులు తయారు చేయడానికి ఏపీఐఐసీ టెండర్లు పిలవనుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక నగరాలు, పరిశ్రమలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల అమలు కోసం నిక్‌డిక్ట్, ఏపీఐఐసీ కలిసి ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం డిజైన్లు, నిర్మాణం, పరీక్షలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలిచేందుకు ఏపీఐఐసీ సిద్ధమవుతోంది. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక నడవ (HBIC) ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,624.64 ఎకరాల్లో భారీ పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం అంగీకరించింది. దీని కోసం రూ.1,771.19 కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూముల ధరలతో కలిపి మొదటి దశలో రూ.2,786.10 కోట్లతో పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. భూముల ధర రూ.1,071 కోట్లు కాగా, మిగిలిన రూ.700 కోట్లను ఏపీఐఐసీ అప్పుగా తీసుకుని పెట్టుబడి పెట్టనుంది. విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవ (VCIC) పరిధిలోని కడప జిల్లా కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో భారీ పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి కానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో మౌలిక సదుపాయాల కోసం రూ.1,264.44 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ పార్కు కోసం కేటాయించిన భూములతో కలిపి రూ.2,136.51 కోట్లతో ప్రాజెక్టును అధికారులు రూపొందించారు. భూముల ధర రూ.872 కోట్లు కాగా, మిగిలిన రూ.392 కోట్లను ఏపీఐఐసీ అప్పుగా తీసుకుని పెట్టుబడి కింద పెట్టనుంది. కొప్పర్తిలో దాదాపు 5,760 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. VCICలో అభివృద్ధి చేసే ప్రాంతం పోను మిగిలిన 3,164 ఎకరాల్లో పార్కు అభివృద్ధికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.


ఇది కూడా చదవండి: ప్లాట్ కొనుగోలుదారులకు భారీ ఊరట..! రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించిన ఏపీ ప్రభుత్వం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AndhraDevelopment #RailwayExpansion #IndustrialGrowth #KurnoolProjects #KrishnapatnamRailLink #OrvakalDevelopment