WHO హెచ్చరిక! ఈ మూడు సిరప్‌లు ప్రాణాంతకం.. అస్సలు వాడకండి!

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి విద్యార్థుల భారం తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు తగిన సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో, 2026 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ముందుకు జరపాలని ప్రతిపాదించింది. గతంలో మాదిరిగా మార్చిలో కాకుండా, ఈసారి ఫిబ్రవరి చివరి వారంలోనే పరీక్షలు ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే రెండు వేర్వేరు షెడ్యూళ్లను సిద్ధం చేసి ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 23 లేదా 25 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధమైందని తెలుస్తోంది.

Donald Trump: భారత్ - పాకిస్తాన్ మధ్య సంబంధాలు! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం లభించిన వెంటనే అధికారిక షెడ్యూల్ ప్రకటించనుంది. రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నందున, ఈ నిర్ణయంపై తుది మాట ఆయనదే. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచే ప్రారంభం కానున్న నేపథ్యంలో, తెలంగాణలోనూ అదే తరహా షెడ్యూల్ అమలు చేసే అవకాశముంది. గతంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరిలోనే జరిగేవి. అయితే కరోనా మహమ్మారి అనంతరం షెడ్యూల్ మార్చి నెలకు వాయిదా పడటంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది.

ఇది కేవలం ట్రంప్ తోనే అంటున్న ..పాకిస్థాన్ ప్రధాన మంత్రి షహ్బాజ్ షరీఫ్!!

ప్రత్యేకించి జేఈఈ మెయిన్, ఎంసెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదాహరణకు 2025లో మార్చి 5న ఇంటర్ పరీక్షలు ప్రారంభమవగా, ఏప్రిల్ 2 నుంచే జేఈఈ మెయిన్ తుది విడత జరగడం వల్ల విద్యార్థులకు కేవలం 12 రోజుల సమయం మాత్రమే దొరికింది. ఈ ఒత్తిడిని తగ్గించేందుకు బోర్డు ముందస్తుగా పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. దీనివల్ల విద్యార్థులకు జాతీయ స్థాయి పరీక్షల ప్రిపరేషన్‌కు కనీసం మూడు వారాల అదనపు సమయం లభించే అవకాశం ఉంది.

Petrol-Diesel prizes: తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పెరిగిన పెట్రోల్ ధరలు..! కానీ దేశంలో ఎంత అంటే..!

అంతేకాదు, బోర్డు పరీక్ష ఫీజులను కూడా పునఃసమీక్షించే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం ప్రాక్టికల్స్ లేని కోర్సులకు రూ.520, ప్రాక్టికల్స్ ఉన్న ఎంపీసీ, బైపీసీ వంటి కోర్సులకు రూ.750 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు ఏపీ, సీబీఎస్ఈ వంటి ఇతర బోర్డులతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని, వాటిని కొంత పెంచి రూ.600, రూ.875గా సవరించాలన్నది బోర్డు ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది తెలంగాణలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

AP Farmers: ఏపీలో వారందరికీ శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్... ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!
నారా లోకేష్ విజన్ ఫలితం.. చరిత్ర సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్!!
Cabinet Sub Committe: స్వర్ణాంధ్ర 2047 దిశగా దీర్ఘకాలిక ప్రణాళిక! కొత్త క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు!
Vande Bharat Depot: ఏపీలో ఆ ప్రాంతానికి మహార్దశ! రూ.300 కోట్లతో వందే భారత్ మెయింటెనెన్స్ డిపో!
ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. బస్ టికెట్ ధరకే విమానం ఎక్కండి! దేశవ్యాప్తంగా ఎక్కడికైనా ఆఫర్ వర్తింపు!
పండగకు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళి, ఛఠ్ పూజ కోసం రికార్డు స్థాయిలో 12,000 ప్రత్యేక రైళ్లు!