గాజా శాంతి సమ్మిట్‌లో ఒక చారిత్రక ఒప్పందం కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందంపై మాట్లాడుతూ చారిత్రక ఒప్పందం కోట్లాది ప్రజల ప్రార్థనలు ఫలించాయి. చాలా మంది అసాధ్యమని అనుకున్నది ఇప్పుడు సాధించడం ద్వారా మధ్యప్రాచ్యంలో శాంతి ఏర్పడింది అని అన్నారు.
ట్రంప్ చెప్పినట్లు ఈ ఒప్పందం ద్వారా గత ఏడాది కాలంగా ఉన్న వాదవివాదాలకు సంఘర్షణలకు, పరిష్కారం కనిపించింది. ఈ ఒప్పందం ద్వారా గాజా ఇజ్రాయెల్ ఇతర మధ్యప్రాచ్య దేశాల మధ్య సుదీర్ఘకాలం స్థిరమైన శాంతి మార్గం ప్రజల భద్రత ఆర్థిక స్థిరత్వం సామాజిక వృద్ధి కోసం ఇది ఒక ప్రధాన అడుగు అని ట్రంప్ విశ్లేషించారు.
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షహ్బాజ్ షరీఫ్ కూడా ఈ శాంతి సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఆయన ప్రసిద్ధ రాజకీయ నాయకుడైన ట్రంప్ ను ప్రశంసిస్తూ మీరే ఈ ప్రపంచానికి ఈ సమయంలో అత్యంత అవసరమైన నాయకుడు. మీ దృష్టి, నాయకత్వం, నిజాయితీ ప్రపంచానికి గైడ్ లైన్ లా మారుతుంది. మేము మీ నాయకత్వాన్ని గౌరవిస్తున్నాము అని ట్రంప్ ను పొగడ్తలతో ముంచి వేశారు..
ప్రధాన మంత్రి షరీఫ్ వ్యాఖ్యలలో ట్రంప్ యొక్క నాయకత్వం వలన ప్రపంచ దేశాలకు ఒక నూతన దిశ ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వం కోసం ఒక పెద్ద దశపథం ఏర్పడిందని చెప్పారు. ఈ చారిత్రక సంఘటనతో మధ్యప్రాచ్యంలో కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న సంఘర్షణలకు ఒక కొత్త పరిష్కార మార్గం కనపడింది ఇది కేవలం ట్రంప్ తోనే సాధ్యమైందని తెలిపారు.
ఈ చారిత్రక సంఘటనతో ప్రపంచ రాజకీయ, సామాజిక వాతావరణం మారుతుంది అని నిపుణులు భావిస్తున్నారు. ప్రజల భద్రత, స్థిరత్వం, అభివృద్ధి దిశగా ఇది ఒక పెద్ద అడుగు అని చెబుతున్నారు.