Bank Holidays: వచ్చే నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు! ముందే ప్లాన్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh), తెలంగాణ (Telanagana)లో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. 2022లో ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది. 

Finalizing Fees: ఏపీ విద్యా హక్కు చట్టం కింద 25శాతం సీట్లు..! ప్రైవేట్ స్కూల్స్‌లో ప్రవేశాలకు ఫీజులు ఖరారు!

ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. జమ్ముకశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. 

Thailand Cambodia Conflict: దక్షిణాసియాలో మరో యుద్ధం..! థాయ్‌లాండ్, కంబోడియా మధ్య భీకర ఘర్షణ!

దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. 170(3) అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలో సెక్షన్ 26కి పరిమితి ఉందని తెలిపింది. 2026లో మొదటి జన గణన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది.

New Zealand: ఆక్లాండ్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయం! ఎక్కడ అంటే!

ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న వ్యాజ్యాలు వరదల్లా వస్తాయని, గేట్లు తెరిచినట్లు అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. 

Bus Incident: ఘోర విషాదం.. ఆర్టీసీ బస్సు నడుపుతుండగా గుండెపోటు.. స్టీరింగ్ పైనే కుప్పకూలిన డ్రైవర్!

కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాలలో డీలిమిటేషన్కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. జమ్మూకశ్మీర్పై ప్రత్యేక దృష్టి సారించారన్న పిటిషనర్ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది. 

Amaravati to Hyderabad: అమరావతి టు ఫ్యూచర్ సిటీ హైదరాబాద్‌కి హై స్పీడ్ ట్రైన్..! ఎప్పుడంటే..?

జమ్మూకశ్మీర్ కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ (Notification) నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణను మినహాయించడం.. ఏకపక్షం, వివక్ష కాదని స్పష్టం చెప్తూ పురుషోత్తం రెడ్డి పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది.

AP Cabinet: ఏపీ మెట్రో ప్రాజెక్టులకు వేగం.. కేబినెట్‌ కీలక నిర్ణయం! ఐటీ రంగాల్లో 1.50 లక్షలమందికి..
Srisailam: ఎగువ నుంచి భారీ వరద... శ్రీశైలం జలాశయం హై అలర్ట్‌లో!
Harihara Veeramallu: 15 నిమిషాల సీన్లు ట్రిమ్, VFX అప్డేట్స్.... హరిహర వీరమల్లు రీ-ఎంట్రీ!