తెలంగాణలో ఉమ్మడి జిల్లాల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు నియామకమయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రత్యేకాధికారులుగా హైదరాబాద్ జిల్లా బాధ్యతను ఇలంబర్తి, రంగారెడ్డికి డి.దివ్య, ఆదిలాబాద్‌కు సి.హరికిరణ్, నల్గొండకు అనితా రామచంద్రన్, నిజామాబాద్‌కు ఆర్.హనుమంతు, మహబూబ్‌నగర్‌కు రవి, కరీంనగర్‌కు సర్ఫరాజ్ అహ్మద్, వరంగల్‌కు కె.శశాంక్, మెదక్‌కు ఎ.శరత్, ఖమ్మంకు కె.సురేంద్ర మోహన్ నియమితులయ్యారు.
వర్ష భీభత్సం నేపథ్యంలో అధికారులు తక్షణమే తమ తమ నియమిత జిల్లాలకు వెళ్లాలని, అక్కడి పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని విపత్తు నిర్వహణకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైతే ఆపద మిత్ర, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయాన్ని తీసుకోవాలని సూచించారు.