చదువులతో తలమునకలవుతున్న విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాలు పండగే! ఇక వరుస సెలవులు వస్తున్నాయంటే... టూర్ ప్లాన్‌లు రెడీ అవుతాయి! జూలై నెల చివరకు వస్తుండటంతో ఆగస్ట్‌కి వేదిక సిద్ధమవుతోంది. ఈసారి ఆగస్ట్ నెల విద్యార్థులకు, ఉద్యోగులకు బంపర్ హాలిడేస్ తీసుకురానుంది. ఒక్కట్రెండు రోజులు కాదు... ఏకంగా 10 రోజుల వ్యవధిలో 6 రోజులు సెలవులే..!
ఆగస్ట్ సెలవుల షెడ్యూల్ ఇలా ఉంది:
ఆగస్ట్ 3 (ఆదివారం): రెగ్యులర్ వీకెండ్ సెలవు
ఆగస్ట్ 8 (శుక్రవారం): వరలక్ష్మీ వ్రతం – ఐచ్చిక సెలవుగా ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు
ఆగస్ట్ 9 (శనివారం): రెండో శనివారం + రాఖీ పండగ
ఆగస్ట్ 10 (ఆదివారం): సాధారణ సెలవు
ఆగస్ట్ 15 (శుక్రవారం): స్వాతంత్ర్య దినోత్సవం
మధ్యలో క్లాసులా..? అబ్బే కాదు!
ఆగస్ట్ 11–14 మధ్య కాలంలో పాఠశాలలు తెరిచే అవకాశమున్నా, తరగతులు జరగవు. జాతీయ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, రిహార్సల్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు బిజీగా ఉంటారు. పిల్లలు ఆటలూ, పాటలూ, రంగురంగుల వేడుకలతో పూర్తిగా ఎంజాయ్ చేయనున్నారు.