Header Banner

సింహాచలం ఘటన వెనుక వారే కారణం! అడ్డగోలుగా..వారి నిర్లక్యమే శోకం, శాపం!

  Thu May 01, 2025 14:43        Others

సింహగిరిపై గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనలో విస్తు పోయే అంశాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఈ ఘటన పైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. విచారణ వేళ ఘటన కు కారణాల పైన కమిటీ ఆరా తీసింది. కూలిన గోడ నిర్మాణంలో నాణ్యత లేదని గుర్తించారు. నాలుగు రోజుల కిందటే గోడ నిర్మాణం పూర్తి చేసారు. పునాది లేకుండానే నాసిరకంగా పనులు చేసారు. ఆలయ వైదిక కమిటీ వారించినా గోడ నిర్మాణం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందనే వాదన వినిపిస్తోంది.

 

ఇది కూడా చదవండిప్లాట్ కొనుగోలుదారులకు భారీ ఊరట..! రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించిన ఏపీ ప్రభుత్వం!



విచారణ మొదలు

సింహాచలంలో గోడ కూలి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన వెనుక నిర్లక్ష్యం వెలుగులోకి వస్తోంది. గోడ నిర్మాణంలో ఏ మాత్రం నాణ్యత పాటించలేదని గుర్తించారు. ఒక్కసారిగా కుప్పకూలి న రిటైనింగ్‌ వాల్‌ కారణంగా సిమెంటు ఇటుకలు, మట్టి కింద నలిగిన భక్తులు ప్రాణాలు కోల్పోయి నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆలయంలో 2.30 గంటలకు ఈదురుగాలులతో అరగంటపాటు భారీ వర్షం కురిసింది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన పందిళ్లు కొన్ని కూలిపోయాయి. కరెంటు కూడా పోయింది. భక్తుల కోసం కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌ పక్క నుంచి రూ.300 దర్శన వరుస ఏర్పాటు చేశారు. వర్షం పడితే కొండ పైనుంచి షాపింగ్‌ మాల్‌ వరకు వాన నీరు వస్తుండటంతో... ఇటీవలే అక్కడ రిటైనింగ్‌ వాల్‌ నిర్మించారు. కేంద్రప్రభుత్వ నిధులతో 'ప్రసాద్‌' పథకం కింద చేపట్టిన ఈ గోడ నిర్మాణం నాలుగు రోజుల క్రితమే పూర్తయింది.


పునాదులు ఏవీ

బలమైన పునాదులు లేకుండా, కాంక్రీట్‌ ఇటుకలతో నిర్మించారు. సరిగ్గా క్యూరింగ్‌ కూడా కాలేదు. భారీవర్షానికి కొండ పైనుంచి నీరు ప్రవహించడంతో... ఆ ఒత్తిడికి గోడ కింద మట్టి కోసుకుపోయింది. తెల్లవారుజామున 3గంటలకు గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దాన్ని ఆనుకునే ఏర్పాటు చేసిన రూ.300 దర్శనం భక్తులపైకి సిమెంట్‌ ఇటుకలు పిడుగుల్లా పడ్డాయి. మట్టి కూడా ముంచెత్తింది. చిమ్మ చీకటి... వర్షం... అంతలోనే భారీ శబ్దం... కేకలుతో ఆ చీకటిలో ఏం జరుగుతుందో తెలిసే లోగానే పలువురు ప్రాణాలు కోల్పోయారు. అంబులెన్స్.. సహాయక సిబ్బంది చేరుకునే సరికే అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే, ఈ టూరిజంలో డిప్యుటేషన్ పైన పని చేస్తున్న ఒక ఇంజనీర్ నిర్లక్ష్యం ఇక్కడ గుర్తించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SimhachalamTragedy #WallCollapseHorror #NegligenceKills #TempleDisaster #SimhachalamWallCollapse #ConstructionScam #FaithCrushed