సియోల్: అమెరికా, దక్షిణ కొరియా దేశాలు కవ్విస్తే.. వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సైన్యానికి పిలుపునిచ్చారు. ఇక నుంచి ద.కొరియాతో ఎటువంటి సయోధ్య, పునరేకీకరణ ప్రయత్నాలు ఉండవని తెగేసి చెప్పారు. ఈ విషయాన్ని ఆ దేశ జాతీయ మీడియా వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా వైపు నుంచి వచ్చే ముప్పును కాచుకొని ఉండాలని ఆయన సూచించారు. 2024లో అమెరికా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయుధ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని కిమ్ భావిస్తున్నట విశ్లేషకులు చెబుతున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఆయన ఆదివారం మిలటరీ కమాండర్ల సమావేశంలో మాట్లాడుతూ.. "వాస్తవాన్ని గుర్తించి దక్షిణ కొరియాతో మా సంబంధాలపై స్పష్టతనివ్వాల్సిన సమయం వచ్చింది. ఒక వేళ వాషింగ్టన్, సియోల్ సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే.. మా వద్ద ఉన్న అణ్వాయుధాలు కూడా వాడటానికి వెనుకాడబోం. మా దేశాన్ని ప్రధాన శత్రువుగా ప్రకటించి.. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవకాశం కోసం చూస్తున్న ప్రజలతో ఎటువంటి సంబంధాలు కొనసాగించం" అని స్పష్టం చేశారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి