అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ నగరం లో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివ రామ కృష్ణ పర్యటించారు. ఎయిర్ పోర్ట్ నుండి అభిమానులు భారీగా తరలి వచ్చి ఆహ్వానించడం జరిగినది.
అక్కడ జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని, నందమూరి తారక రామారావు గారు మరియు నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది.
ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగిస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం కార్యక్రమాలు వాటి ద్వారా ప్రజలకు అందుతున్న అద్భుత ఫలాలు, అదే విధంగా నూతన GST విధానంతో దేశానికి తద్వారా రాష్ట్రానికి లభించే అద్భుత ఫలాలు గురుంచి, ముఖ్యంగా P4 విధానంతో ఆర్థికంగా వెనుకబడిన వేల కుటుంబాల ఎలా కాంతి వంతం అవుతాయో వివరిస్తూ, మన భాద్యత గా అ P4 కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని కోరడం జరిగినది.
కార్యక్రమంలో పలువురు ప్రసంగిస్తూ, డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు పార్టీ కోసం చేసిన సేవను కొనియాడారు. వారు తెలుగుదేశం పార్టీ ఆస్తి, తెలుగుదేశం పార్టీ ప్రజా సేవలో మమేకం అవుతునంత సమయం కోడెల గారు పేరు, వారు రాష్ట్రానికి, పార్టీ కి అందించిన సేవలు సజీవంగా ఉంటాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా క్యాన్సర్ కి ఆన్సర్ ఉండాలంటూ తెలుగు వల్లభుడు నందమూరి తారకరామారావు గారు తీసుకొన్న నిర్ణయం ఇప్పటికీ కోడెల గారి ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న ఇండో అమెరికన్ క్యాన్సర్ తెలుగు రాష్ట్రాలలో కాకుండా భారతదేశం స్థాయిలో పేద బడుగు వర్గాలకు ఉపయోగపడిన తీరు, అ ఆసుపత్రి అభివృద్ధిలో కోడెల గారు చేసిన అవిరళ కృషిని పలువురు గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో దర్శి జనసేన ఇంచార్జ్ గరికపాటి వెంకట్, ఎన్నారై టీడీపీ డాలస్ సభ్యుడైన వీరు, ధూళిపాళ్ల కృష్ణ, వెంకట్, మాధవరావు, హరేంద్ర, ఉడత శ్రీనివాస్, గాలి నాగేశ్వరావు, కిరణ్ పోతురాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.