Header Banner

ఇస్రోలో జాబ్‌ చేయడం మీ డ్రీమా? రాత పరీక్షలేకుండా ఛాన్స్! వాటి ఆధారంగా ఎంపిక!

  Thu May 01, 2025 15:42        Employment

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో)లో పని చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే మీకో శుభవార్త.. తాజాగా ఇస్రో సైంటిస్ట్‌, ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారిని హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, మహేంద్రగిరి, అహ్మదాబాద్, హసన్, వలియమల, శ్రీహరికోట కేంద్రాల్లో నియమించే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 63 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో 22 పోస్టులు, మెకానికల్‌ విభాగంలో 33 పోస్టులు, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 8 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్‌ డిగ్రీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే 2024 లేదా 2025 గేట్‌ స్కోరు కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 ఏళ్లు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు చెందినవారికి వయసులో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో మే 149, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. 2024/2025 గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతల ఆధారంగా 1:7 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 జీతంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ, న్యూ పెన్షన్‌ స్కీమ్‌/ యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్, వ్యక్తిగత, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు, ఎల్‌టీఏ, గ్రూప్‌ ఇన్సూరెన్స్, హౌస్‌బిల్డింగ్‌ అడ్వాన్స్‌ వంటి ఇతర సదుపాయాలు కల్పిస్తారు. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే..? ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. ఇందులో అకడమిక్‌ నాలెడ్జ్‌కు 40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌కు 20 మార్కులు, ప్రజెంటేషన్‌, కమ్యూనికేషన్‌ స్కిల్‌కు 20 మార్కులు, కాంప్రహెన్షన్‌కు 10 మార్కులు, అకడమిక్‌ అచీవ్‌మెంట్స్‌కు 10 మార్కులు కేటాయిస్తారు. ఇంటర్వ్యూలో 60 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. ఇంటర్వ్యూకు 50 శాతం, గేట్‌ స్కోరుకు 50 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇతక వివరాలకు ఇస్రో వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.

ఇది కూడా చదవండి: వరుసగా రెండోసారి ఏటీఎఫ్ ధర తగ్గింపు! వారికి మాత్రమే మినహాయింపు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ISROJobs #ISRORecruitment #DreamJob #NoWrittenExam #GATEScore #EngineeringCareers