Header Banner

ఐరాసలో పాక్‌ను ఎండగట్టనున్న భారత్! దానిని రక్షించేందుకు పాక్ యత్నం!

  Sun May 11, 2025 21:46        Politics

ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని ప్రపంచం ముందు మరోసారి ఎండగట్టేందుకు భారత్ సిద్ధమైంది. ముఖ్యంగా కశ్మీర్‌లో హింసకు పాల్పడుతున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (టీఆర్ఎఫ్)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ, ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలతో త్వరలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)కి ఒక ప్రతినిధి బృందాన్ని పంపనుంది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది అమాయక పౌరుల మృతికి కారణమైన ఉగ్రదాడిని ఖండిస్తూ యూఎన్‌ఎస్‌సీ విడుదల చేసిన ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరును చేర్చకుండా పాకిస్థాన్ అడ్డుకుందని భారత్ తీవ్రంగా ఆరోపించింది. ఈ దాడికి తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ రెండుసార్లు ప్రకటించుకున్నప్పటికీ, పాక్ దౌత్యపరంగా ఉగ్రసంస్థలకు అండగా నిలుస్తోందని ఈ చర్య స్పష్టం చేస్తోందని భారత వర్గాలు పేర్కొన్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పుట్టుకొచ్చిన టీఆర్ఎఫ్, లక్షిత హత్యలు, ఉగ్రవాదుల నియామకం, ఆయుధాల అక్రమ రవాణా వంటి అనేక హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతోందని భారత్ ఆరోపిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1267 (1999) కింద ఏర్పాటైన... ఐసిల్ (దాయెష్) మరియు అల్-ఖైదా ఆంక్షల కమిటీగా కూడా పిలువబడే ప్రత్యేక కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. ఈ కమిటీ ఉగ్రవాద నిర్మూలనకు, ముఖ్యంగా ఐసిల్, అల్-ఖైదా మరియు వాటితో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షల అమలును పర్యవేక్షిస్తుంది. ఈ సమావేశంలో టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా అధికారికంగా గుర్తించి, దాని సభ్యులపై ఆంక్షలు, ప్రయాణ నిషేధాలు విధించాలని భారత్ డిమాండ్ చేయనుంది.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #Meeting #TamilNadu