హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తాజాగా, విమానాశ్రయంలో థెరపీ డాగ్స్‌ను ప్రవేశపెట్టారు. ఇవి ప్రయాణికులకు మానసిక ఉత్సాహాన్ని అందిస్తాయి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాయి. ప్రయాణ సమయంలో కలిగే టెన్షన్, ఉక్కిరిబిక్కిరి భావాలను తగ్గించేందుకు, ప్రయాణికులకు సానుభూతితో కూడిన అనుభూతిని కలిగించేందుకు ఈ చర్య చేపట్టారు. ఈ కుక్కలు రోజుకు నాలుగు నుంచి ఆరు గంటల వరకు, ఇంటర్నేషనల్ మరియు డొమెస్టిక్ డిపార్చర్ గేట్ల దగ్గర ఉండనున్నాయి.
ప్రముఖ వైద్య సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం, కుక్కలతో కొంత సమయం గడిపితే ఒత్తిడి హార్మోన్లు తగ్గి, సిరోటోనిన్ లెవల్స్ పెరుగుతాయి. థెరపీ డాగ్స్‌ను పట్టుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఎలాంటి శబ్దాలు చేయకుండా, సురక్షితంగా ఈ కుక్కలతో ప్రయాణికులు స్వేచ్ఛగా మెస్మరైజ్ కావచ్చు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులు దీనిపై ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంతో హైదరాబాద్ విమానాశ్రయం దేశవ్యాప్తంగా దారితీసే విమానాశ్రయాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఢిల్లీ, ఇస్తాంబుల్, డెన్వర్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి విమానాశ్రయాల్లో ఇదే తరహా థెరపీ డాగ్ ప్రోగ్రామ్స్ విజయవంతంగా అమలవుతున్నాయి. ఇప్పుడు మన దేశంలో కూడా ప్రయాణ అనుభవాన్ని మానవీయంగా మార్చేందుకు ఈ ప్రయోగం ఒక మంచి ఆరంభంగా మారనుంది.