Reduce Hip Fat Tips: ముఖ్యంగా మహిళల్లో హిప్ ప్రాంతంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం సాధారణం. కానీ ఇది కేవలం అందానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఎక్కువ హిప్ ఫ్యాట్ శరీర బరువును పెంచి జాయింట్ నొప్పులు, షుగర్ వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. ఫిట్నెస్ నిపుణుల ప్రకారం, చిన్న జీవనశైలి మార్పులు మరియు సరైన వ్యాయామ పద్ధతులు పాటిస్తే హిప్ ఫ్యాట్‌ను తగ్గించడం సాధ్యమే.
శరీరంలో ఒక్క భాగం ఫ్యాట్ తగ్గించడం సాధ్యం కాదు
ఫిజికల్ ట్రైనర్ చెబుతున్నట్లుగా హిప్స్, తొడలు లేదా నడుము మాత్రమే సన్నబెట్టాలనే ఆలోచన సరికాదు. శరీరం మొత్తం ఫ్యాట్ తగ్గినప్పుడు హిప్ ఫ్యాట్ కూడా సహజంగానే తగ్గుతుంది. అంటే హిప్స్‌కి ప్రత్యేకంగా మ్యాజిక్ డైట్ లేదని స్పష్టం చేశారు.
వ్యాయామం – హిప్ ఫ్యాట్‌పై మొదటి దాడి
రోజూ 30 నిమిషాల వ్యాయామం చాలా తేడా చూపుతుంది. నిపుణులు సూచించే కొన్ని సరళమైన వ్యాయామాలు ఇవి:
1. స్క్వాట్స్ – తొడలు (హిప్స్ )రెండింటినీ బలపరుస్తాయి. రోజుకు రెండు సెట్‌లు చేయడం ప్రారంభించండి.
2. లంజెస్ –తొడలు బలపడతాయి, బరువు సమతుల్యం అవుతుంది.
3. లెగ్ లిఫ్ట్‌లు– పడుకొని చేసే ఈ వ్యాయామం హిప్ సైడ్ ఫ్యాట్ తగ్గించడంలో చాలా ఉపయోగకరం.
4.HIIT (high-intensity interval training) వర్కౌట్స్ తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం. తేలికపాటి కార్డియో, స్ప్రింట్స్, జంప్స్ కలిపి చేస్తే మొత్తం శరీరం చురుకుగా ఉంటుంది.
రోజుకు 20 నిమిషాల వ్యాయామం వారానికి మూడు రోజులు చేసినా ఫలితాలు త్వరగా కనిపిస్తాయి.
ఫిట్నెస్ డైటీషియన్ సూచనల ప్రకారం
ప్లేటులో రంగులు ఎక్కువగా ఉండాలి అంటే కూరగాయలు, పండ్లు, గింజలు ఉండాలి. ఫ్యాట్ తగ్గాలంటే మొదట చక్కెర తగ్గించాలి.
మిఠాయిలు, ప్యాకేజ్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి
తగినంత నీరు తాగాలి
రాత్రి తినే భోజనం తేలికగా ఉండాలి
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి (ఉదా: ఓట్స్, సలాడ్లు)
 
  నిద్ర & ఒత్తిడి – కనిపించని కారణాలు
ఒత్తిడి పెరిగితే శరీరం కార్టిసాల్ హార్మోన్ విడుదల చేస్తుంది. ఇది ఫ్యాట్ నిల్వ చేయడానికి దారితీస్తుంది. అందుకే యోగా, ధ్యానం, సాఫ్ట్ మ్యూజిక్ వంటి పద్ధతులు పాటించడం మంచిది. రోజుకు కనీసం 7 గంటల నిద్ర తీసుకోవడం శరీర చక్రాలను సమతుల్యం చేస్తుంది.
ఫలితాలు కనిపించడానికి సమయం పడుతుంది
హిప్ ఫ్యాట్ ఒక్కరోజులో తగ్గదు. కానీ క్రమశిక్షణతో కొనసాగితే 6–8 వారాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఆ సమయంలో నడక, నీరు, నిద్ర అన్నీ సరిగ్గా ఉండాలి.
హిప్ ఫ్యాట్ తగ్గించడం అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు అది ఆరోగ్యానికి కూడా సంబంధించిన విషయం. సరైన వ్యాయామం, సమతుల ఆహారం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ ఇవన్నీ కలిపి పాటిస్తే, హిప్స్ కూడా సన్నబడుతుంది మనసు కూడా హ్యాపీగా ఉంటుంది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
         
         
         
         
         
         
         
         
        