గుండెపోటుతో వైద్యుడు మృతిచెందిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. రుయా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట నడుచుకుంటూ వెళ్తుండగా ప్రొఫెసర్ డాక్టర్ నాగేంద్ర (53)కు గుండెపోటు వచ్చింది. రుయా అత్యవసర వార్డులో సీపీఆర్ నిర్వహించి మెరుగైన వైద్యం కోసం స్విమ్స్క తరలించారు.
అక్కడికి వెళ్లేలోపే డాక్టర్ నాగేంద్ర మృతిచెందారు. ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. ఇటీవలే నెల్లూరు ప్రభుత్వాసుపత్రి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి నాగేంద్ర బదిలీపై వచ్చారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్లో నివాసముంటున్నారు. నాగేంద్ర మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించి బంధువులకు సమాచారం ఇచ్చారు.