రెడ్ అలర్ట్ జారీ – ప్రభుత్వ శాఖలు అప్రమత్తం.. ఆ ప్రాంతాలలో భారీ వర్షాల సూచన!!

ఆధునికత ఎంతగా పెరిగినా, సాంకేతికత ఎంత గొప్పదైనా, కొన్నిసార్లు అవి మానవ మనుగడకే పెను ప్రమాదంగా మారవచ్చు అనడానికి ఢిల్లీ ఒక ఉదాహరణ. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఢిల్లీ – ఒకప్పటి నాగరికతకు కేంద్రంగా, నేటి AI యుగానికి రాజధానిగా నిలిచింది. అయితే, దురదృష్టం ఏమంటే ఇక్కడి వాయు కాలుష్యం స్థాయి ఆందోళనకరం నగర వైభవం పక్కన పెడితే ఢిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చే భాగ్యాన్ని కోల్పోయారనేది నేటి వాస్తవం.

దిల్లీ నగరంలో దీపావళి పండుగ తర్వాత గాలి పరిస్థితి తీవ్రమైన సమస్యగా మారిందని. వాయు నాణ్యతా సూచిక (AQI) ప్రమాదకరంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు ఉన్న వారు ఎక్కువ ఇబ్బందులు పడతారు. 

ఈ సమస్యను తాత్కాలికంగా తగ్గించడానికి ప్రతీ సంవత్సరం ప్రభుత్వం కొన్ని నియంత్రణలు అమలు చేస్తుంది. ఉదాహరణకు, వాహనాల రాకపోకలను తగ్గించడం, నిర్మాణ పనులను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంటారు. అయితే ఇవి పెద్ద స్థాయిలో ప్రభావం చూపవు. అందుకే దిల్లీలో కృత్రిమ వర్షం ద్వారా ఇది వాయు కాలుష్యాన్ని తాత్కాలికంగా తగ్గించగలదని అధికారులు భావిస్తున్నారు.

కృత్రిమ వర్షం కోసం ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తల బృందం దిల్లీలో ప్రయోగం ప్రారంభించింది. మొత్తం వ్యయం రూ. 3.21 కోట్లు అని ప్రభుత్వం తెలిపింది. ఈ వర్షం ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే, అత్యవసర పరిస్థితుల్లో, నియంత్రిత విధంగా కురిపించబడుతుంది. 

కృత్రిమ వర్షం క్లౌడ్ సీడింగ్ అనే సాంకేతిక పద్ధతితో కురిపించబడుతుంది. ఇందులో సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ లాంటి రసాయనాల మిశ్రమాన్ని విమానాలు, హెలికాప్టర్లు మేఘాలపై చల్లిస్తాయి. ఈ రసాయనాలు మేఘాల్లోని నీరు, తేమను ఆకర్షించి పెద్ద నీటి బిందువులను తయారు చేస్తాయి. అవి చివరికి వర్షంగా కురుస్తాయి. ఈ ప్రక్రియకు సుమారు 30 నిమిషాలు పడుతుంది.

క్లౌడ్ సీడింగ్ రెండు రకాలుగా ఉంటుంది:

1. హైగ్రోస్కోపిక్ క్లౌడ్ సీడింగ్ మేఘంలోని నీటి బిందువులు కలిసిపోతాయి, పెద్ద బిందువులుగా మారి వర్షంగా కురుస్తాయి.
2. గ్లేసియోజెనిక్ క్లౌడ్ సీడింగ్ చల్లగా ఉన్న మేఘాల్లో మంచు పేరుకుపోతుంది, అది వర్షానికి దారితీస్తుంది.

కృత్రిమ వర్షం కొంతవరకు కాలుష్యాన్ని తగ్గించగలదు. అయితే, రసాయనాల వల్ల పర్యావరణం, నేలు, నీరు, జలచరాలపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. కురిపించిన ప్రాంతం బయట సహజ వర్షపాతంలో అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఖర్చు కూడా ఎక్కువ, ఫలితాలు ఎల్లప్పుడూ ఆశించినట్లు ఉండవు.

ఈ ప్రయత్నం విజయవంతం కావాలంటే 11 ప్రభుత్వ విభాగాల అనుమతులు తప్పనిసరి. వీటిలో వాతావరణ శాఖ, పర్యావరణ శాఖ, రక్షణ శాఖ, హోం శాఖ, భారత వాతావరణ విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వంటి శాఖలు ఉన్నాయి. ఐఎండీ (భారత వాతావరణ శాఖ) రియల్ టైమ్ సమాచారం అందిస్తుంది. మేఘాలు ఎక్కడ, ఎంత ఎత్తులో, తేమ ఎంత, గాలి దిశ ఏదో తెలుసుకుని మాత్రమే వర్షాన్ని కురిపించాలి.

Housing Scheme: పేదలకు నాణ్యమైన ఇళ్లు మాత్రమే..! అలా చేశారో డబ్బులు ఇవ్వరు.. కొత్త రూల్..!
CJI Appointment: భారత సుప్రీంకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి! కేంద్రం అధికారికంగా ప్రక్రియ మొదలు..!
బంగారం ధరలు నేటి మార్కెట్లో తగ్గుముఖం – వెండి స్థిరంగా, నిఫ్టీ-సెన్సెక్స్ లాభాల్లో!!
Accident: కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..! ట్రావెల్స్ బసలో మంటలు.. 25 మంది మృతి..!
TET: ఏపీ TET నోటిఫికేషన్ విడుదల..! 2011కు ముందే నియమితులూ అయిన వారికి షాక్..!
Railway Jobs: రైల్వే శాఖ భారీ నోటిఫికేషన్‌..! 5,810 గ్రాడ్యుయేట్‌ పోస్టులకు దరఖాస్తులు..!
చాక్లెట్ పరిశ్రమ పెట్టండి.. అబుదాబిలో సీఎం చంద్రబాబు వన్ టూ వన్ సమావేశాలు.! ఆతిథ్య రంగంలోనూ..
Industrial Sector: పారిశ్రామిక రంగానికి బంపర్ ఆఫర్..! రూ.1,030 కోట్ల ప్రోత్సాహకాలు విడుదలకు గ్రీన్ సిగ్నల్..!
APSRTC Recruitment: ఏపీఎస్‌ఆర్‌టీసీ భారీ నోటిఫికేషన్‌..! రాత పరీక్ష లేదు..! మెరిట్‌ ఆధారంగా ఎంపిక..!
ఏపీకి డబుల్ టెన్షన్..24 గంటల్లో.! బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం.. రేపు మరో అల్పపీడనం!
Singapore: ఆ పని చేయకపోతే శాశ్వత నివాస హోదా రద్దు! డిసెంబర్ నుండి..
DGCA: విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై కొత్త నిబంధనలు!
Delhi Pollution: ఢిల్లీని మళ్లీ కమ్మేసిన స్మాగ్‌.. వాయు కాలుష్యం పెరిగిపోవడంతో GRAP-2 అమల్లోకి!
Indian Techie: 15 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి.. అమెరికా టెక్ ఇంజినీర్ పోస్ట్ వైరల్!
Venezuelan plane: టేకాఫ్ నుంచి కూలిపోయే వరకు.. వైరల్ అవుతున్న వెనిజులా విమాన ప్రమాదం!
WhatsApp: వాట్సాప్‌లో కొత్త మార్పు! ఇక ఫోన్ నంబర్ లేకుండానే..
Gold Prices: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం ప్రధాన కారణం!
Tourism: భారతీయులు వీసా లేకుండా వెళ్లగలిగే ఆసియా దేశాలు! కానీ ఆ వీసా ఉండాలి!
Metro: మెట్రోలో నిషేధిత వస్తువులు.. వాటికి కూడా నో..! DMRC కఠిన భద్రతా చర్యలు..!