ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముంచుకొచ్చిన వేళ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల elections సెప్టెంబర్ 30 నాటికి నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మంత్రి రవీంద్ర పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు.
పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా ప్రచారం జరపాలని సూచించారు. టీడీపీ పాలనలో ప్రజలకు ఎంత న్యాయం జరిగిందో గుర్తుచేస్తూ, వైసీపీ పాలనలో జరిగిన తప్పులను ప్రజల్లో వివరించాలని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేతలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలన్నారు.
ఈసీ సాంకేతికతను ఉపయోగించి ఈసారి ఎన్నికల నిర్వహణలో నవత్వం చూపనుంది. E-nomination ద్వారా అభ్యర్థులు ఇంటి నుంచే నామినేషన్ వేయొచ్చు. అలాగే ఫలితాలను మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తక్షణమే తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల నమోదు, పోటీ అభ్యర్థుల జాబితా, పోలింగ్ కేంద్రాల సమాచారం వంటి అంశాలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తేనున్నారు.
ఈ ఏర్పాట్లన్నీ పూర్తయిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.