ఏపీలో చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కమిటీలో 10 నుంచి 12 మంది సభ్యుల్ని నియమిస్తూ శాసన మండలి సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ ప్రకటన విడుదల చేశారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన సదుపాయాలు, వన్యప్రాణులు-పర్యావరణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. బీదా రవిచంద్రయాదవ్ అధ్యక్షతన బీసీ సంక్షేమ కమిటీ, వర్ల కుమార్ రాజా అధ్యక్షతన ఎస్సీ సంక్షేమ కమిటీ, మిర్యాల శిరీషదేవి అధ్యక్షతన ఎస్టీ సంక్షేమ కమిటీ, నజీర్ అహ్మద్ అధ్యక్షతన మైనార్టీ సంక్షేమ కమిటీ, గౌరు చరిత అధ్యక్షతన మహిళ, శిశు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీ, తోట త్రిమూర్తులు అధ్యక్షతన సబార్డినేట్ లెజిస్ట్రేషన్ కమిటీ, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అధ్యక్షతన గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేసింది.