Economic Zone: ఏపీలో 20 వేల ఎకరాల ఎకనామిక్ జోన్! 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం... మారబోతున్న ఆ 8 జిల్లాల రూపురేఖలు!

అమరావతి రాజధానిలో మరో కీలక అభివృద్ధి చోటుచేసుకుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తమ ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి తుది ఒప్పందాన్ని పూర్తి చేసింది. ఇందుకోసం గుంటూరు జిల్లా నేలపాడు గ్రామంలో మూడు ఎకరాల భూమి ను రాష్ట్రము నుండి కొనుగోలు చేసింది. ఈ భూమికి ఆర్‌బీఐ రూ. 12 కోట్లు చెల్లించింది.

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా! జొన్న రొట్టె vs రాగి రొట్టె.. ఇదే బెస్ట్!

శుక్రవారం ఈ భూమి కొనుగోలు ఒప్పందం అధికారికంగా కుదిరింది. ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వి.సి. రూప్, రాష్ట్ర ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్ వి. డేవిడ్ రాజు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది.

National Highway: ఏపీలో కొత్తగా మూడు రహదారులకు ప్రతిపాదనలు! ఆ జిల్లాకు మహర్దశ!

ఆర్‌బీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కొత్త కార్యాలయం సుమారు 1.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోషనిర్మించబడనుంది. ఈ ప్రాజెక్టు కోసం బ్యాంక్ దాదాపు రూ. 200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. కార్యాలయంలో ప్రధాన భవనం, సమావేశ హాళ్లు, డేటా సెంటర్‌, ఉద్యోగుల విభాగాలు, రికార్డు రూములు వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

మరో 200 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాలని ప్లాన్! మీరు ఎక్కడైనా భూమి ఇవ్వండి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్య!

రాజధాని నగరంలో రిజర్వ్ బ్యాంక్ వంటి జాతీయ స్థాయి సంస్థలు తమ స్థావరాన్ని ఏర్పరచుకోవడం, అమరావతి ఆర్థిక పరంగా ఎదుగుతున్నదానికి సూచికగా భావించవచ్చు. భవిష్యత్తులో ఇది దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన ఫైనాన్షియల్ హబ్‌గా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీకి రెడ్ అలెర్ట్ - 'మొంథా' తుఫా! 90-110 కి.మీ. వేగంతో.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్!

ప్రస్తుతం భూమి రిజిస్ట్రేషన్ పూర్తయింది. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అధికారులు అంచనా ప్రకారం, ఈ కార్యాలయ భవనం రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తవుతుందని తెలుస్తోంది.

రవితేజ 'మాస్ జాతర' సెన్సార్ పూర్తి.. విడుదల తేదీ ఖరారు - సెన్సార్ టాక్ ఏంటంటే..!

ఈ ప్రాజెక్ట్ ద్వారా అమరావతి నగరానికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించనుంది. రిజర్వ్ బ్యాంక్‌ అడుగుతో రాజధానిలో ఆర్థిక రంగం మరింత చురుకుదనాన్ని సంతరించుకోనుంది.

Railway Lines: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో రైల్వే లైన్లపై కీలక ప్రకటన! రూ. 316 కోట్లతో...
నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు! ఖాతాదారులు తప్పక తెలుసుకోండి!
Kurnool incident: కర్నూలు ఘటనపై సోనూసూద్ స్పందన.. శివశంకర్ స్పాట్‌లోనే మృతి.. గాయాలతో ఎర్రిస్వామి భయంతో!
Express Ways: ప్రపంచంలోనే పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌లు ఉన్న టాప్ 10 దేశాలు! ఆసియా నుండి..